Train Ticket: రైలు మిస్సయిందా..? టికెట్‌ను కేన్సిల్ చేసి డబ్బులు రీఫండ్ కోసం ట్రై చేశారా..? ఈ పొరపాటును మాత్రం అస్సలు చేయకండి..!
ABN, First Publish Date - 2023-04-07T17:44:55+05:30
రైలు ప్రయాణానికి మూడు నెలల ముందో.. లేదంటే నెల రోజుల ముందో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటాం. ఇంకా లేదంటే తత్కాల్ అయిన బుక్ చేసుకుంటాం. ఇంత చేసినా ఒక్కోసారి జర్నీ మిస్ అవుతుంటుంది. లేదంటే కన్ఫాం కాకపోతే
రైలు ప్రయాణానికి మూడు నెలల ముందో.. లేదంటే నెల రోజుల ముందో ట్రైన్ టికెట్ (Train Ticket) బుక్ చేసుకుంటాం. ఇంకా లేదంటే తత్కాల్ అయిన బుక్ చేసుకుంటాం. ఇంత చేసినా ఒక్కోసారి జర్నీ మిస్ అవుతుంటుంది. లేదంటే కన్ఫాం కాకపోతే డబ్బులు తిరిగి వచ్చేస్తాయి. ఇంకా లేదంటే ట్రైన్ కేన్సిల్ అయినా మనీ రీఫండ్ అయిపోతుంది. ఇదంతా ఎందుకంటారా? ఓ టికెట్‌కు సంబంధించి రీఫండ్‌కు ప్రయత్నించిన ఓ మహిళకు ఎదురైనా పరిస్థితి చూశాక.. మళ్లీ మీరు అలాంటి పని చేయరు.
రైల్వే టికెట్‌కు (Railway ticket) సంబంధించి రీఫండ్‌కు ప్రయత్నించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) సైబర్ నేరగాళ్ల చేతిలో అడ్డంగా బుక్కైంది. నోయిడాకు చెందిన ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. తన రైలు 4 గంటలు ఆలస్యమైనందున ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నుంచి రీఫండ్ పొందడానికి ప్రయత్నం చేసి లక్షలు పోగొట్టుకుంది
.
ఆమె ఐఆర్‌సీటీసీ కస్టమర్ కేర్‌కు ఫోనే చేసింది. అవతలి వ్యక్తి ఆమెకు ఒక లింక్ పంపాడు. ఈ లింక్‌పై ఫిర్యాదు చేయాలని ఆమెకు చెప్పాడు. ఆమె లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే తన ఫోన్ హ్యాక్ అయిందని మహిళ వెంటనే గమనించింది. హ్యాకర్ ఆన్‌లైన్‌లో ఉండగానే రూ. 3 లక్షల విలువైన రుణం తీసుకున్నాడని బాధిత మహిళ తెలిపింది. క్రెడిట్ కార్డును ఉపయోగించి మరో రూ.2 లక్షలు డెబిట్ చేశాడని ఆమె పేర్కొంది. హ్యాకర్ తనను ఆన్‌లైన్‌లో ఉండమని చెప్పినట్లు వివరించింది. తాను ప్రభుత్వ అధికారినని, ఏదైనా తప్పు చేస్తే ఉద్యోగం పోతుందని మోసగాడు తనతో చెప్పాడని మహిళ పేర్కొంది. దీనిపై అప్రమత్తమైన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ విషయమై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. IRCTC ఎప్పుడూ ఏ కస్టమర్ నుంచి వ్యక్తిగత వివరాలను కోరదని తెలిపింది. ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పట్టుమని పదేళ్లు కూడా ఉండవు కానీ.. 27 అంతస్తుల భవనం అంచున ఇద్దరు పిల్లల నిర్వాకమిదీ..!
ఇది కూడా చదవండి: Shocking News: ఈ కాలం పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి..? వద్దన్నా హెయిర్ కటింగ్ చేయించారని బాత్రూంలోకి వెళ్లి మరీ..
Updated Date - 2023-04-07T17:44:55+05:30 IST