ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking Video: పాపులర్ అవాలనుకుని.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. వీడియో తీయండ్రా అంటూ ఫ్రెండ్స్‌కు చెప్పి మరీ..!

ABN, First Publish Date - 2023-04-12T15:16:00+05:30

కొందరు సెల్ఫీ (Selfie), రీల్ వీడియోల (Reel Videos) కోసం తమ ప్రాణాలను రిస్క్‌లో పడేసుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంటర్నెట్ డెస్క్: కొందరు సెల్ఫీ (Selfie), రీల్ వీడియోల (Reel Videos) కోసం తమ ప్రాణాలను రిస్క్‌లో పడేసుకుంటున్నారు. ప్రమాదమని తెలిసిన.. వెనక్కి తగ్గడం లేదు. క్షణిక ఆనందం కోసం ప్రాణాలనే పణంగా పెట్టేస్తున్నారు. ఇదే కోవలో ఇప్పటికే ఎన్నో సంఘటనలు జరిగాయి కూడా. తాజాగా మరో సంఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక హిల్ స్టేషన్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఫ్లిప్ (Flip) చేస్తూ వీడియో తీయమని ఫ్రెండ్స్‌కు చెప్పాడు. కానీ, ఆ తర్వాత అతడు ఊహించని విధంగా ప్రమాదం బారిన పడ్డాడు. ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. @NoContextHumans అనే ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు 4.2 మిలియన్ల మంది వీక్షించారు. 45వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఓ వ్యక్తి ఒక హిల్ స్టేషన్ (Hill Station) వెళ్లడం.. అక్కడ ఓ కొత్త స్టంట్ చేయడం వీడియోలో ఉంది. ఆ హీల్ స్టేషన్ అంచున ఫ్లిప్ చేయాలనేది అతడి ఆలోచన. అక్కడ తనతో పాటు ఉన్న స్నేహితులకు వీడియో తీయండ్రా అంటూ చెప్పి.. ఫ్లిప్ వేశాడు. కానీ, ఫ్లిప్పింగ్ (Flipping) సమయంలో చేతులు పట్టుతప్పడంతో ఆ ఎత్తైన ప్రాంతం నుంచి నేరుగా కిందికి జారీ పోయాడు. ఎనిమిది సెకండ్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. పాపులర్ కావడం కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేసే వారికి ఇదోక గుణపాఠం అని అంటున్నారు.

Wife: మొదటి అంతస్తులోని ఓ గదిలోంచి అరుపులు కేకలు.. తాళాలు పగలగొట్టి చూస్తే ఇనుప గొలుసులతో కనిపించాడో వ్యక్తి.. ఏమైందని అడిగితే..


Updated Date - 2023-04-12T15:16:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising