Crime News: మరీ ఇంత నీచమా..? పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని బయటకు తీసి మరీ అత్యాచారం చేశారు..!
ABN, First Publish Date - 2023-04-19T19:39:57+05:30
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు, మూఢనమ్మకాలను విశ్వసించి కొందరు దారుణాలకు పాల్పడుతుంటారు. మరికొందరైతే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా పూజల పేరుతో క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా..
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు, మూఢనమ్మకాలను విశ్వసించి కొందరు దారుణాలకు పాల్పడుతుంటారు. మరికొందరైతే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా పూజల పేరుతో క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా, రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు.. ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు పూడ్డిపెట్టిన మహిళ మృతదేహాన్ని బయటికి తీశారు. మరీ నీచంగా మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్‌లోని (Rajasthan) సికార్ జిల్లా అజిత్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (road accident) మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం పోలీసులు.. సదరు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంగళవారం మహిళ మృతదేహానికి అంత్యక్రియలు (funeral) నిర్వహించిన అనంతరం అంతా ఇళ్లకు చేరుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు.. అర్ధరాత్రి స్మశాన వాటికకు చేరుకున్నారు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. మరీ దారుణంగా మృతదేహంపై (woman dead body) అత్యాచారానికి పాల్పడ్డారు. శ్మశాన వాటికలో అలికిడి వస్తుండడంతో చుట్టు పక్కల వారు వెళ్లి చూశారు.
జరుగుతున్న దారుణంపై వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో అంతా అక్కడికి చేరుకుని వారిని పట్టుకున్నారు. చితకబాదిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. వారి వద్ద నుంచి మద్యం బాటిళ్లు.. తాంత్రిక పూజలకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మహిళ మృతదేహంపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా పూజలు కూడా నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఓ వ్యక్తి స్థానిక ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శంకర్‌లాల్ అని తెలిసింది. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోద చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-04-19T19:39:57+05:30 IST