ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ram Charan: ‘నాటు నాటు’ కు 7 రోజుల రిహార్సల్స్.. 15రోజుల షూట్

ABN, First Publish Date - 2023-02-24T15:02:32+05:30

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ నామినేషన్‌ను దక్కిచుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ రేసులో నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ నామినేషన్‌ను దక్కిచుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ రేసులో నిలిచింది. ఆస్కార్ పురస్కారాల తేదీ దగ్గరపడటంతో రామ్‌చరణ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. పాపులార్ అమెరికన్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ లోను మాట్లాడారు. తాజాగా ఏబీసీ న్యూస్ ఛానల్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు. హాలీవుడ్ ఫిలిం మేకర్స్‌తోను పని చేయాలని ఉందని చెప్పారు.

‘‘ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి అమెరికాలోను ప్రశంసలు రావడం అద్భుతంగా ఉంది. హాలీవుడ్‌లో ఇంత భారీ విజయం సాధిస్తుందని నేను ఊహించలేదు. ఇక్కడ లభించిన ఆదరణ చూసి నాకెంతో సంతోషమేసింది. ఉక్రెయిన్‌లోని ఓ ప్యాలెస్‌లో ‘నాటు నాటు’ పాటను షూట్ చేశాం. దాదాపుగా 15రోజులు చిత్రీకరించాం. అంతకు ముందు 7రోజుల రిహార్సల్స్ చేశాం. ఈ సాంగ్‌ను చిత్రీకరించడం కొంచెం కష్టతరమైన పని. ఉక్రెయిన్ ఎంతో అందంగా ఉంటుంది. నేను వీలు చూసుకుని ఆ దేశాన్ని సందర్శిస్తాను. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఎంతో చరిత్ర ఉంది. మా దేశం నుంచి ఓ పాట మొదటిసారిగా ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ సాంగ్‌కు పురస్కారం వస్తే అది మా విజయం మాత్రమే కాదు.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి దక్కిన విజయం. భారతీయ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉంది. ఈ దేశం నుంచి వచ్చిన ఓ పాట అకాడమీకి నామినేట్ కావడం మాపై బాధ్యతను మరింత పెంచింది. ఆస్కార్స్ వన్‌టైం వండర్‌గా మిగిలిపోకూడదు. మరెన్నో భారతీయ చిత్రాలు గోల్డెన్ గ్లోబ్స్, ఆస్కార్స్ అందుకోవడానికి మళ్లీ మళ్లీ రావాలని నేను కోరుకుంటున్నాను’’ అని రామ్ చరణ్ తెలిపారు.

‘‘సినిమాకు భాష లేదని మా దర్శకుడు రాజమౌళి ఎల్లప్పుడు చెప్పేవారు. మూవీ అంటే భావోద్వేగాలు మాత్రమే. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ ను చూసి ప్రజలు నవ్వారు. ఏడ్చారు. డ్యాన్స్ చేశారు. ఈ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ అనేది రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్‌ల బెస్ట్ వర్క్. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. అన్ని రకాల సాంస్కృతి, సంప్రదాయాలు గొప్పవే. అయితే, ఇండియాలో హిందీ మాట్లాడే వారు ఎక్కువ ఉండటంతో బాలీవుడ్‌పై అందరి దృష్టి ఉంటుంది. భారత్‌లోని అన్ని రాష్ట్రాలు అద్భుతమైన సినిమాలను నిర్మిస్తున్నాయి. జాతీయ అవార్డులను గెలుచుకుంటున్నాయి. ప్రస్తుతం నా చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి. ఇండియా బయట కూడా పనిచేయాలని నాకు ఉంది. హాలీవుడ్ డైరెక్టర్స్ భారతీయ నటుల వైపు చూడాలి. మాకు అతి త్వరలోనే హాలీవుడ్ ఫిలిం మేకర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తాయని ఆశిస్తున్నాను’’ అని రామ్ చరణ్ మనసులోని మాట చెప్పారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-24T15:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising