తల్లి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కొడుకు.. నిజామా, కాదా అని నిర్ధారించుకునే లోపే ఓ రోజు..
ABN, First Publish Date - 2023-01-21T21:04:56+05:30
తన తల్లికి మరో యువకుడికి వివాహేతర సంబంధం ఉందని స్నేహితులు చెప్పడంతో కొడుకు షాక్ అయ్యాడు. ఆ వార్తను జీర్ణించుకోలేకపోయాడు. ఇది నిజామా, కాదా అని నిర్ధారించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఈలోపే..
తన తల్లికి మరో యువకుడికి వివాహేతర సంబంధం ఉందని స్నేహితులు చెప్పడంతో కొడుకు షాక్ అయ్యాడు. ఆ వార్తను జీర్ణించుకోలేకపోయాడు. ఇది నిజామా, కాదా అని నిర్ధారించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఈలోపే గ్రామస్తులంతా అదే విషయాన్ని మాట్లాడు్కుంటుండడంతో తీవ్ర అవమానంగా భావించాడు. చివరకు ఓ రోజు స్నేహితులతో కలిసి అతడు చేసిన పని.. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..
గర్భిణికి ఆపరేషన్ చేసి, పిండాన్ని పెంపుడు కుక్కకు తినిపించిన వైద్యులు.. 11 రోజుల తర్వాత చూస్తే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన పంకజ్ అనే వ్యక్తి ఇటీవల ఓ రోజు స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడుతున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి పంకజ్ వద్దకు వచ్చి.. ‘‘ మీ అమ్మకు, దీపక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం (extramarital affair) ఉందని చెబుతున్నారు’’.. అని చెప్పాడు. దీంతో పంకజ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిజమా, కాదా అని ఆలోచించుకునే లోపే.. ఓ రోజు గ్రామస్తులంతా ఇదే విషయాన్ని మాట్లాడుకోవడం విన్నాడు.
దీన్ని తీవ్ర అవమానంగా భావించిన పంకజ్.. తన స్నేహితుడు బదన్ సింగ్, మరికొంత మందితో కలిసి దీపక్‌ను హతమార్చేందుకు కుట్రపన్నారు. జనవరి 14న అంతా కలిసి దీపక్‌ను హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 6రోజుల తర్వాత పంకజ్, అతడి తల్లి, బదన్ సింగ్‌తో పాటూ మరికొందరిని అరెస్ట్ చేశారు. మృతుడికి, పంకజ్ తల్లికి మధ్య సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీపక్ హత్య విషయం అందరికీ తెలిసినా.. కావాలనే దాచి పెట్టారన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.
Updated Date - 2023-01-21T21:05:03+05:30 IST