ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఓ చిన్న అద్దం వల్ల కారు ఎలా కాలిపోయిందో చూడండి.. కారు డోర్ తీయగానే..!

ABN, First Publish Date - 2023-08-03T18:41:34+05:30

కొన్నిసార్లు తెలీక చేసే చిన్న చిన్న తప్పుల కారణంగా చివరకు పెద్ద నష్టం సంభవిస్తుంటుంది. ఇంకొన్నిసార్లు చోటు చేసుకునే ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషిస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, అలాంటి ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన కారులో చిన్న అద్దం వదిలి వెళ్లిపోయింది. చాలా సేపటి తర్వాత...

కొన్నిసార్లు తెలీక చేసే చిన్న చిన్న తప్పుల కారణంగా చివరకు పెద్ద నష్టం సంభవిస్తుంటుంది. ఇంకొన్నిసార్లు చోటు చేసుకునే ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషిస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, అలాంటి ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన కారులో చిన్న అద్దం వదిలి వెళ్లిపోయింది. చాలా సేపటి తర్వాత తిరిగి వచ్చి కారు డోర్ తీయగా.. లోపల మొత్తం కాలిపోయి కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కారులో మండుటెండలో పార్క్ చేసి బయటికి వెళ్లింది. అయితే వెళ్తూ వెళ్తూ కారు వెనుక భాగంలో ఓ అద్దాన్ని (mirror) వదిలివెళ్లింది. చాలా సేపు బయటికి వెళ్లిన ఆమె.. తర్వాత తిరిగి వచ్చి కారు డోరు తీసింది. ఇంకేముందీ.. లోపల మొత్తం పొగ కమ్ముకుని ఉంది. అలాగే కారు వెనుక భాగంలో చాలా భాగం కాలిపోయింది. ఈ సీన్ చూడగానే ఆమెకు మొదట ఏమీ అర్థం కాలేదు. సాధారణంగా ఇంజిన్‌లో మంటలు చెలరేగటం చూస్తుంటాం.. కానీ ఈ కారులో మాత్రం వెనుక వైపు మంటలు (car caught fire) రేగడం ఏంటని ఆమె అవాక్కయింది. అయితే వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Buffalo vs Tiger: ఒకే ఒక్క పులి.. పదుల సంఖ్యలో గేదెలు.. చివరకు జరిగింది చూస్తే మతిపోవడం ఖాయం..!

చివరకు పరిశీలించగా, కారు వెనుక వైపు వదిలివెళ్లిన చిన్న అద్దం కారణంగానే ఇదంతా జరిగినట్లు తెలిసింది. ఎండలో అద్దాన్ని ఉంచి.. తద్వారా కాగితాన్ని కాల్చేలా చేసినట్లుగా.. కారులో కూడా జరిగిందని తెలుసుకున్నారు. అద్దం పక్కనే మండే పదార్థాలు ఉండడంతో సూర్యకిరణాలు వాటిపై పడి మంటలు చెలరేగినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఇదేంటీ.. మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘అద్దాలతో ఇంత ప్రమాదం ఉందన్నమాట’’.. అని మరికొందరు, ‘‘సీట్లకు అటాచ్ చేసే బేబీ మిర్రర్లు భూతద్దంలా కూడా పనిచేస్తాయి.. వాటిని కొనడం మానేయండి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Marriage: పెళ్లి వేడుకలోనే వరుడిని చితకబాదిన వధువు.. బంధువులంతా చూస్తుండగానే కింద పడేసి..!

Updated Date - 2023-08-03T18:41:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising