ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Smart Phone: కొడుకని చేతికి ఫోన్ ఇస్తే.. తండ్రికి చుక్కలు చూపించిన బుడ్డోడు.. ఇంతకీ ఏం ఆర్డర్ చేశాడంటే..

ABN, First Publish Date - 2023-02-07T21:11:59+05:30

ఆడుకునే పిల్లలే కదా అని ఎప్పుడు అడిగితే అప్పుడు ఫోన్లు ఇస్తున్నారా.. అయితే ఈ వార్త తెలిస్తే ఒకపై చచ్చినా మీ పిల్లలకు ఫోన్ ఇవ్వరు. కొడుకే కదా అని ఆడుకునేందుకు ఫోన్ ఇచ్చిన తండ్రికి చివరికి చుక్కలు చూపించాడో బుడ్డోడు. ఫోన్లో కొడుకు ఆర్డర్ చేసిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆడుకునే పిల్లలే కదా అని ఎప్పుడు అడిగితే అప్పుడు ఫోన్లు ఇస్తున్నారా.. అయితే ఈ వార్త తెలిస్తే ఒకపై చచ్చినా మీ పిల్లలకు ఫోన్ ఇవ్వరు. కొడుకే కదా అని ఆడుకునేందుకు ఫోన్ ఇచ్చిన తండ్రికి చివరికి చుక్కలు చూపించాడో బుడ్డోడు. ఫోన్లో కొడుకు ఆర్డర్ చేసిన వస్తువులు, బిల్ చూసుకుని చివరకు ఖంగుతిన్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఆరేళ్ల వయసున్న మాసన్ అనే బుడ్డోడికి ఫుడ్ అంటే చచ్చేంత ఇష్టం. కొడుకంటే తండ్రి కీత్ స్టోన్ హౌస్‌కు ఎంతో ఇష్టం. దీంతో ఏమడిగినా కాదనకుండా తీసిచ్చేవాడు. ఇటీవల స్మార్ట్ ‌ఫోన్‌కు (Smart phone) అలవాటు పడ్డ మాసన్.. తరచూ తండ్రి ఫోన్ తీసుకుంటూ ఉండేవాడు. కొడుకే కదా అని తండ్రి కూడా ఎప్పుడ అడిగితే అప్పుడు ఫోన్ ఇస్తూ వచ్చాడు. అయితే ఇటీవల ఆడుకుంటానంటూ ఫోన్ తీసుకుని బుడ్డోడు చేసిన పనికి తండ్రి ఖంగుతిన్నాడు. తండ్రి స్మార్ట్ ఫోన్ తీసుకున్న మాసన్.. ఓ ఆన్‌లైన్ యాప్ (Online App) ద్వారా వివిధ రకాల తిండి పదార్థాలను ఆర్డర్ (Food order) చేశాడు. రొయ్యలు, శాండ్‌విచ్ (Sandwich), ఐస్‌క్రీమ్, పిజ్జాలు (Pizzas), రైస్, చిల్లీ చీజ్ ఫ్రై.. ఇలా దాదాపు 12 రకాల ఫుడ్ ఐటెమ్స్‌ని ఆర్డర్ చేశాడు. మొత్తం 1000 డాలర్ల (సుమారు రూ.82వేలు) బిల్ చేశాడు.

యువతి బంధువునంటూ అంబులెన్స్ ఎక్కాడు.. ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉండగా.. ఆమెకు సేవలు చేస్తూనే..

కొడుక్కు ఫోన్ ఇచ్చి టీవీ షో చూస్తూ ఉన్నానని తండ్రి చెప్పాడు. కాసేపటికి కిటిలోంచి బయటకు చూడగా... ఎవరో కొత్తవారు తన ఇంటికి వచ్చారని తెలిపాడు. కొన్ని కార్లు తన ఇంటి వద్దకు వస్తుంటే, మరికొన్ని కార్లు వెళ్తూ ఉన్నాయన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక బయటికి వెళ్లి విచారించగా.. అసలు విషయం తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తర్వాత తన ఫోన్ చూసుకోగా, ఒక్క పిజ్జాలకే 439 డాలర్ల (439 dollars) ఖర్చు చేసినట్లు మెసేజ్ వచ్చినట్లు తెలిపాడు. చేసిన ప్రతి ఆర్డర్ ఆర్డర్‌కూ 25శాతం టిప్ కూడా ఇవ్వడం చూసి అంతా అవాక్కయ్యారు. తప్పు తెలసుకున్న తండ్రి.. డబ్బు విలువ తెలియజెప్పేందుకు మాసన్ కిడ్డీ బ్యాంక్‌లో ఉన్న 115డాలర్లను తీసేసుకున్నాడు. ఇది నాకు గుణాపాఠం వంటిదని, పిల్లలకు ఇలాంటివి అలవాటు చేయొద్దంటూ మాసన్ తండ్రి సూచిస్తున్నాడు.

Viral Video: ఇదేం పిచ్చిరా బాబూ.. శోభనం వీడియోను నెట్టింట పోస్ట్ చేసిన నవ దంపతులు.. మండిపడుతున్న నెటిజన్లు..!

Updated Date - 2023-02-07T21:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising