35 ఏళ్ల వయసు దాటినా ఎంతకూ పెళ్లి కావడం లేదని ఇద్దరు అన్నాదమ్ముళ్ల నిర్వాకమిదీ.. ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు..!
ABN, First Publish Date - 2023-03-04T19:01:26+05:30
పెళ్లి సంబంధాల విషయంలో కొన్నిసార్లు.. అమ్మాయి, అబ్బాయి కుటుంబంలో ఎవరో ఒకరు చివరి నిముషంలో మనసు మార్చుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో..
పెళ్లి సంబంధాల విషయంలో కొన్నిసార్లు.. అమ్మాయి, అబ్బాయి కుటుంబంలో ఎవరో ఒకరు చివరి నిముషంలో మనసు మార్చుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడూ దారుణాలు జరుగుతుంటాయి. ఇటీవల రాజస్థాన్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇద్దరు అన్నాదమ్ముళ్లకు 35 ఏళ్ల వయసు దాటినా పెళ్లి కాలేదు. దీంతో చివరకు వారు చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు..
రాజస్థాన్ (Rajasthan) జాలోర్ సమీపంలోని రామ్‌సీన్ ప్రాంత పరిధి మోద్రాన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన రతన్ సింగ్ అనే వ్యక్తికి భార్య ఇంద్ర కన్వర్(45), కొడుకు, కుమార్తె ఉన్నారు. ఇదిలావుండగా, ప్రబాత్‌సింగ్, పహర్‌సింగ్ అనే సోదరులు కూడా స్థానికంగా నివాసం ఉంటున్నారు. కాగా, రతన్ సింగ్ కుమార్తెను ప్రబాత్‌సింగ్, పహర్‌సింగ్‌లో ఒకరికి అట్టాసత్తా పద్ధతి ప్రకారం వివాహం (marriage) చేస్తామని మాట్లాడుకున్నారు. అయితే ఇందుకు రతన్ సింగ్ భార్య ఇంద్ర కన్వర్ ఒప్పుకోలేదు. దీంతో ప్రబాత్‌సింగ్, పహర్‌సింగ్‌కు 35 ఏళ్లు దాటినా వివాహం కాలేదు. ఈ క్రమంలో తరచూ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇటీవల ఓ రోజు రతన్ సింగ్ భార్య, పిల్లలు ఇంట్లో ఉండగా.. ప్రబాత్‌సింగ్, పహర్‌సింగ్ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో రతన్ సింగ్ బయట ప్రాంతానికి వెళ్లాడు.
ఇంట్లో వెళ్లిన వారు పెళ్లి విషయంలో ఇంద్ర కన్వర్‌తో వాగ్వాదానికి దిగారు. వివాహం చేసేందుకు ఇంద్రకన్వర్ ఒప్పుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో గొడ్డలితో దాడి (attack) చేశారు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకోవడానికి వచ్చిన పొరుగింటి వ్యక్తిపై కూడా దాడి చేయడంతో అతనూ మృతి చెందాడు. మధ్యలో అడ్డొచ్చిన మేనల్లుడిపై కూడా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని రెండు మృతదేహాలనూ పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితుల్లో ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం (suicide attempt) చేయబోగా.. పోలీసులు అడ్డుకుని స్టేసన్‌కి తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Updated Date - 2023-03-04T19:01:26+05:30 IST