ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: చిరుత నుంచి తప్పించుకుని కారు వద్ద సేదతీరుతున్న జింక.. భయంతో చాలా సేపు ఎదురు చూసిన పులి.. చివరకు ఏమైందంటే..

ABN, First Publish Date - 2023-06-24T19:19:58+05:30

అడవి జంతువుల మధ్య పోరాటం, ఆహారం కోసం అవి చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటుంది. పులులు, సింహాలు మెరుపుదాడితో జంతువులను వేటాడుతుంటాయి. అయితే అప్పడప్పుడూ ఆహారం తీరా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడవి జంతువుల మధ్య పోరాటం, ఆహారం కోసం అవి చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటుంది. పులులు, సింహాలు మెరుపుదాడితో జంతువులను వేటాడుతుంటాయి. అయితే అప్పడప్పుడూ ఆహారం తీరా నోటి దాకా వచ్చి చివరకు దక్కకుండా పోతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిరుత పులికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చిరుత నుంచి తప్పించుకున్న జింక.. టూరిస్టుల కారు వద్ద సేదతీరుతూ ఉంది. వాహనాలన్నీ ఉండడంతో భయపడ్డ పులి.. చివరకు ఏ చేసిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో చిరుత పులి వేటకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Tiger viral video) అవుతోంది. చాలా మంది టూరిస్టులు కార్లలో వెళ్లి అడవిలో సంచరిస్తూ ఉండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. మేత మేస్తున్న జింకల మంద మీద (Tiger attack on deer) ఓ చిరుత పులి దాడి చేస్తుంది. దీంతో జింకలన్నీ ఒక్కో వైపు పరుగులు పెడతాయి. ఓ జింక మాత్రం టూరిస్టుల వాహనాల (Tourist vehicles) వైపు వెళ్లి ఓ కారు వద్ద సేద తీరుతుంటుంది. చిరుత పులి దాన్ని వెంబడిస్తూ అక్కడికి వెళ్తుంది. అయితే టూరిస్టుల వాహనాలు చూసి భయంతో రోడ్డు పక్కనే ఆగిపోతుంది.

Cow Video: వారెవ్వా.. ఈ అవు చేసిన పనేంటో చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం.. లేగ దూడను కాపాడిన వ్యక్తిని చూడగానే..!

మరోవైపు జింక కారు వద్ద హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. పులి మాత్రం వెనక్కు వెళ్లలేక.. అలాగని జింక వద్దకు పోలేక అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇలా కొన్ని నిమిషాల తర్వాత.. ‘‘ఏమైతే అది అయింది.. ఎలాగైనా జింకను ఎత్తుకెళ్లాలి’’.. అన్నట్లుగా మెల్ల మెల్లగా కారు పక్క నుంచి జింక వద్దకు వెళ్తుంది. ఆ సమయంలో జింక అటు వైపు తిరిగి ఉండడంతో పులిని గమనించదు. దగ్గరికి వెళ్లిన పులి వెంటనే జింక మెడ పట్టుకుని అడవిలోకి ఎత్తుకెళ్లిపోతుంది. ఈ ఘటన మొత్తం కారులో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Bride Video: కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురి ఎంట్రీ.. నేరుగా పెళ్లిపీటలపైకి ఎక్కకుండా వధువు చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు..!

Updated Date - 2023-06-24T19:19:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising