Viral Video: వామ్మో.. కాకి జీవితం ఇలా ఉంటుందా? వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో.. నెటిజన్ల రియాక్షన్లు ఏంటంటే..
ABN, First Publish Date - 2023-08-18T12:08:26+05:30
మన ఇంటి చుట్టు పక్కల రోజూ కనిపించే కాకులన పెద్దగా పట్టించుకోం. కాకులను అశుభాలకు సూచనగా పరిగణిస్తాం. కాకి అరిస్తే చుట్టాలు వస్తారని అపోహ పడుతుంటాం. పారిశుధ్య కార్మికులుగా కాకులు చేస్తున్న మంచిని పట్టించుకోం. మిగతా పక్షుల గురించి ఆలోచించినట్టు కాకుల గురించి ఆలోచించం.
మన ఇంటి చుట్టు పక్కల రోజూ కనిపించే కాకులను (Crows) పెద్దగా పట్టించుకోం. కాకులను అశుభాలకు సూచనగా పరిగణిస్తాం. కాకి అరిస్తే చుట్టాలు వస్తారని అపోహ పడుతుంటాం. పారిశుధ్య కార్మికులుగా కాకులు చేస్తున్న మంచిని పట్టించుకోం. మిగతా పక్షుల గురించి ఆలోచించినట్టు కాకుల గురించి ఆలోచించం. వాటికి కనీసం ఆహారం, నీళ్లు కూడా అందించం. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ అంకుర్ అగర్వాల్.. మనదేశంలోని కాకుల పరిస్థితి గురించి ఓ ఫన్నీ వీడియో (Funny Video) రూపొందించాడు.
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @ankur_agarwal_vinesలో ఆ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో అంకుర్ (Ankur agarwal) స్వయంగా నల్ల దుస్తులు ధరించి కాకిలా నటించాడు. కాకిలా ఓ ఇంటి నుంచి మరో ఇంటి మీదకు గెంతడం, వర్షం వచ్చినపుడు ఏదైనా నిర్మాణం కింద తలదాచుకోడం వంటివి చేశాడు. అలాగే నీరు, ఆహారం కావాలని అడుగుతూ కాకిలా అరిచాడు. కాకులు అరిస్తే చుట్టాలు వస్తారని ఉన్న అపోహను ఎత్తి చూపాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
Viral Video: ఇదెక్కడి పెళ్లి విందురా బాబు.. వరద నీటిలో విందు ఆరగించిన మహిళలు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!
ఈ ఫన్నీ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. దాదాపు 9 లక్షల లైక్‌లను సంపాదించింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``నిజంగా మనుషులకు మేలు చేసే కాకులకు విలువ లేదు``, ``భయ్యా.. అచ్చం కాకిలా నటించావు``, ``కాకి పరిస్థితి ఇలా ఉంటుందా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-08-18T12:08:26+05:30 IST