Viral Video: ఇళ్లలోనే కాదు.. ఆఖరికి ఈ విమానంలోనూ సేమ్ ప్రాబ్లెమ్.. టేకాఫ్ సమయంలో ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-10-12T18:22:34+05:30
కొన్నిసార్లు ఊహించని ప్రదేశాల్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చెట్ల పొదల్లో ఉండాల్సిన పాములన్నీ.. ఇళ్లల్లోని ఫ్రిడ్జ్‌లు, మంచాల కింద, షూలలో దర్శనమిస్తుంటాయి. అలాగే నీళ్లలో ఉండాల్సిన మొసళ్లన్నీ.. ఉన్నట్టుండి ఊహించని విధంగా నేల అడుగు నుంచి బయటకు వస్తుంటాయి. ఇలాంటి..
కొన్నిసార్లు ఊహించని ప్రదేశాల్లో అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చెట్ల పొదల్లో ఉండాల్సిన పాములన్నీ.. ఇళ్లల్లోని ఫ్రిడ్జ్‌లు, మంచాల కింద, షూలలో దర్శనమిస్తుంటాయి. అలాగే నీళ్లలో ఉండాల్సిన మొసళ్లన్నీ.. ఉన్నట్టుండి ఊహించని విధంగా నేల అడుగు నుంచి బయటకు వస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. టేకాఫ్ అవుతున్న విమానంలో ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఘటనతో ప్రయాణికులంతా అవాక్కయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
గ్వాడలజారా అనే ప్రాంతం నుంచి మెక్సికో (Guadalajara Mexico flight) వెళ్లే విమానంలో అక్టోబర్ 6న ఈ ఘటన చోటు చేసుకుంది. మెక్సికోకు వెళ్లాల్సిన విమానం గ్వాడలజారా ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉంది. ప్రయాణికులంతా వారి వారి సీట్లలో కూర్చున్నారు. పైలెట్ విమానాన్ని స్టార్ట్ చేసిన కొద్ది సేపటికే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎలా వచ్చాయో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు గానీ.. దోమల గుంపు మొత్తం (Mosquitoes entered the plane) విమానంలోకి ప్రవేశించింది. ఒక్కసారిగా లోపలికి వచ్చిన దోమలన్నీ ప్రయాణికులను ఎడాపెడా కుట్టడం మొదలెట్టాయి. ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఈ ఘటనతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఎయిర్‌హోస్టెస్ స్పందించి దోమల స్ప్రేతో (mosquito spray) అక్కడికి వచ్చారు. విమానం మొత్తం దోమల మందును స్ప్రే చేశారు.
Viral Video: పాము తోక పట్టుకుని యువకుడి కోతి చేష్టలు.. పొరపాటున కూడా ఇలాంటి పని మాత్రం చేయకండి..
దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు కొందరు అట్ట ముక్కలు తీసుకుని విసురుకోవడం కలిపించింది. చాలా సేపు శ్రమించి ఎట్టకేలకు దోమలను విమానం నుంచి వెళ్లగొట్టారు. ఇళ్లలో దోమల బెడదను గుర్తు చేసినట్లుగా ఉండే ఈ సీన్ చూసి అంతా అవాక్కవుతున్నారు. కాగా, ఈ ఘటనలో విమానం రెండు గంటలకు పైగా ఆలస్యంగా వెళ్లింది. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఈ విమానాశ్రయం పక్కనే పెద్ద మురుగు నీటి కుంట ఉన్నట్లు తెలిసింది. అందులోనూ ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరంతా ఆ కుంటలోకి వచ్చి చేరింది. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో దోమల బెడద పెరిగిపోయింది. ఈ దోమల గుంపు అక్కడి నుంచే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-12T18:22:34+05:30 IST