Viral: ఇలాంటి ఫొటో మీరెప్పుడూ చూసుండరు! 2 ఏళ్లలో 150 కేజీల బరువు తగ్గితే ఏమవుతుందో తెలుసా?

ABN , First Publish Date - 2023-04-27T19:13:28+05:30 IST

ఇలాంటి ఫొటో మీరెప్పుడూ చూసుండరు...

Viral: ఇలాంటి ఫొటో మీరెప్పుడూ చూసుండరు! 2 ఏళ్లలో 150 కేజీల బరువు తగ్గితే ఏమవుతుందో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: ఊబకాయంతో వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఊబకాయులు బరువు తగ్గించుకునేందుకు తెగ తాపత్రయ పడుతుంటారు. అమెరికాకు చెందిన కోల్ ప్రొచెస్కా కూడా సరిగ్గా ఇదే సమస్యతో సతమతమయ్యాడు. అతడు ఏకంగా 200 కేజీలకు పైగా బరువు ఉండేవాడు. పరిస్థితి ఇలాగే ఉంటే దీర్ఘకాలిక రోగాల బారిన పడి మరణిస్తాడని వైద్యులు చెప్పేశారు. దీంతో, రెండేళ్లల్లో అతడు ఏకంగా 150 కేజీల బరువు తగ్గాడు(Man loses 150 kg in months). అతడు కొరుకున్నది సాధించాడు. అయితే, శరీరంలోని కొవ్వంతా ఒక్కసారిగా కరిగిపోవడంతో ఒంటిపై చర్మం తిత్తులు వేళాడటం ప్రారంభించాయి. దీంతో, నలుగురిలో ఉండగా షర్ట్ తొలగించాలంటే భయమేస్తోందంటూ అతడు చెప్పుకొచ్చాడు. తన పరిస్థితిని వివరిస్తూ ‘అప్పుడు, ఇప్పుడు’ క్యాప్షన్‌తో కోల్ షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

బరువు తగ్గించుకునేందుకు కోల్ కఠినమైన క్రమశిక్షణను పాటించాడు. రోజూ జిమ్‌కు వెళ్లేవాడు. కచ్చితంగా పది వేల అడుగులు నడిచేవాడు. తిండి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. నిపుణుల సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేర్పులు చేశాడు. వారు సూచించిన మేరకే ఆహారం తీసుకునే వాడు. ఇలా రెండేళ్ల పాటు సాగిన అతడి కఠోర శ్రమ చివరకు గొప్ప ఫలితాన్నే ఇచ్చింది. కానీ, శరీరంలో కొవ్వు అంతా కరిగిపోవడంతో కొత్త సమస్య వచ్చింది.

ఊబకాయం కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు కోల్ చర్మం కూడా అందుకు అనుగుణంగా సాగింది. అయితే, ఒక్కసారిగా బరువు కోల్పోవడంతో ఒంటిపై చర్మం అంతేవేగంగా తగ్గలేదు. దీంతో, అదనపు చర్మమంతా ఒంటిపై తోళ్ల తిత్తులు వేలాడుతున్నట్టు విచిత్రంగా తయారైంది. ఈ ఫొటోలనే అతడు నెట్టింట్ షేర్ చేశాడు.

అయితే, ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీన్నే బాడీ స్కల్ప్టింగ్ అంటారు. ఇందులో భాగంగా వైద్యులు అదనపు చర్మాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. విడతల వారీగా జరిగే ఈ చికిత్స పూర్తయ్యేందుకు కొన్ని నెలల సమయం పడుతుంది. అయితే, తన ఇన్సూరెన్స్ సంస్థ ఈ చికిత్స ఖర్చును భరిస్తుందా? లేదా? అనే సందేహం కోల్‌కు కలిగింది. ఈ ఆపరేషన్‌కు ఇన్సూరెన్స్ సంస్థ డబ్బులు ఇవ్వని పక్షంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సమకూర్చుకుంటానని కోల్ చెబుతున్నాడు.

Updated Date - 2023-04-27T19:31:19+05:30 IST