ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anand Mahindra: ఓ రైతు వాడుతున్న ట్రాక్టర్ ను చూసి ఆనంద్ మహీంద్రా షాక్.. కారణం ఏమిటంటే..

ABN, First Publish Date - 2023-02-22T13:46:02+05:30

ఆనంద్ మహీంద్రా చాలా అరుదైన విషయాన్ని తన ట్విట్టర్ లో పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని షేర్ చేసే ఆనంద్ మహీంద్రా చాలా అరుదైన విషయాన్ని తన ట్విట్టర్ లో పంచుకున్నారు. ఓ రైతు వాడుతున్న ట్రాక్టర్ ను చూసి ఈయవ షాకయ్యారు. అదేదో ట్రాక్టర్ లో వైవిధ్యం వల్ల ఆయన ఆశ్చర్యపడ్డారని అనుకుంటే పొరబడినట్టే.. ఆ ఆశ్చర్యం వెనుక కారణం ఆ రైతు వాడుతున్న ట్రాక్టర్ మహీంద్రా కంపెనీ వారిది కావడమే.. ఇదేమీ పెద్ద వింత కాదని అనుకుంటున్నారా.. అయితే విషయం మొత్తం తెలుసుకోండి.

బాలా దేవ్ కేట్ (Bala devkate) అనే వ్యక్తి ట్విట్టర్ లో ఒక వీడియో షేర్ చేశాడు. 'ఆనంద్ మహీంద్రాకు ఆ గ్రూపుకు చాలా థ్యాంక్స్. నేను 265 DI 35 HP ట్రాక్టర్ ను 1988లో కొన్నాను. అప్పటినుండి ఈ ట్రాక్టర్ ను ఉపయోగిస్తున్నాను. ఈ ట్రాక్టర్ 35సంవత్సరాలు పూర్తిచేసుకుంది. అయినా ఇప్పటికీ చాలా చక్కగా పనిచేస్తోంది. సుమారు 12టన్నుల వంటచెరకును మోస్తున్నా ఏమాత్రం ఇబ్బంది లేదు' అని ట్రాక్టర్ వంటచెరకును మోస్తూ నడుస్తున్న వీడియోను షేర్ చేశాడు. అది చూసిన ఆనంద్ మహీంద్రా షాకయ్యారు. ఆ తరువాత సంతోషానికి లోనయ్యారు. 'తమ వాహనాలు సాధారణ పౌరుల జీవితాల్లో ఇంతగా భాగమైపోవడం తమకెంతో ఆనందంగా ఉంది' అంటూ ఆనంద్ మహీంద్రా ఆ వీడియో షేర్ చేసుకున్నారు.

Read also: Viral video: పిల్లల్ని తినేద్దామని వచ్చిన చిరుతను ముప్పుతిప్పలు పెట్టిన ముళ్ళపంది జంట.. ఫిధా అవుతున్న నెటిజన్లు..


అయితే నెటిజన్లు మాత్రం ఈ విషయం పట్ల ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ఇప్పట్లో వెహికల్స్ కు టైం వేలిడిటీ పెడుతున్నారు కదా అలాంటిది 35ఏళ్ళ కిందటి వాహనం వాడటం కరెక్టేనా అంటున్నారు. మరికొందరు అంత పాత ట్రాక్టర్ మీద అంత బరువు వేయడం ఎంతవరకు సురక్షితమని అంటున్నారు. కానీ ఒక సంస్థ తమ వాహనాలు అన్నేళ్ళయినా అంత స్టాండర్డ్ గా ఉండటం చూసి సంతోషడటం సాధారణమే కదా.. చాలామంది బ్రాండ్ అనగానే పేరుకు పెట్టాలి అంత డబ్బు అనేస్తుంటారు. కానీ బ్రాండ్ అంటే కేవలం పేరు కాదు. ఇదిగో ఇలా మన్నిక ఉండటమే బ్రాండ్ లో గొప్పదనం కాదంటారా?

Updated Date - 2023-02-22T13:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising