Viral: నేను వరల్డ్ కప్ మ్యాచ్ చూడను.. ఆనంద్ మహింద్రా సంచలన ప్రకటన..కారణం తెలిస్తే..
ABN , First Publish Date - 2023-11-19T15:13:35+05:30 IST
వరల్డ్ కప్ ఫైనల్స్ ఎలా ఉంటుందో అనే ఆందోళనతో ఆనంద్ మహీంద్రా మ్యాచ్ చూడట్లేదంటూ సంచలన ప్రకటన చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్ కప్ ప్రారంభమైంది(world cup finals). క్రికెట్ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠ ప్రారంభమైంది. భారత్ ఎలాగైనా కప్ గెలవాలని కోరుకుంటున్న అభిమానులు.. మైదానంలో ప్లేయర్ల స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. టీమిండియా అంటే ప్రాణంపెట్టే అభిమానులు అయితే మ్యాచ్‌ను చూసేందుకు కూడా జంకుతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరిదీ ఇదే సీన్. ఇందుకు తాజా ఉదాహరణే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).
Mohammed Shami: మహ్మద్ షమీని అరెస్టు చేయవద్దు.. ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసుల ట్వీట్
Trees on Dividers: రోడ్డుకు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో తెలిస్తే..
ఆనంద్ మహీంద్రా తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట్ వైరల్‌గా(Viral) మారింది. తాను ఈసారి వరల్డ్ కప్ మ్యాచ్‌ను చూడనంటూ సంచలన కామెంట్ చేశారు. అందుకు కారణం కూడా ఆయన చెప్పారు. ‘‘లేదు లేదు.. ఈ రోజు నేను మ్యాచ్ చూడదలుచుకోలేదు. కానీ టీమిండియా జెర్సీ వేసుకుని అందరికీ దూరంగా ఓ గదిలో కూర్చుంటా. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా దూరంగా ఉంటా. భారత్ గెలిచిందని ఎవరైనా తలుపుకొట్టి చెప్పాకా బయటకు వస్తా’’ అంటూ ట్వీట్ చేశారు(Anand Mahindra says he will not watch finals match).
Viral: ఇబ్బందుల్లో ఉన్న పందికొక్కు.. చూసి తట్టుకోలేకపోయిన కాకి.. చివరకు.. నెట్టింట వీడియో వైరల్!
ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది. మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి జనాలు పోటెత్తినా ఆట చూడనంటమేంటని కొందరు ప్రశ్నించారు. అయితే, తనకు ఏర్పడిపోయిన ఓ నమ్మకం కారణంగానే ఇలా చేస్తున్నట్టు ఆనంద్ మహీంద్రా వివరించారు. తాను గతంలో మ్యాచ్ చూసిన ప్రతిసారీ ఇండియా ఓడిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు ఆయన మ్యాచ్ కొనసాగుతుండగానే మధ్యలో వెళ్లిపోయిన ఘటనలూ ఉన్నాయి. అయితే, అభిమానులు మాత్రం ఆయనను మ్యాచ్ చూడమంటూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కీలక మ్యాచ్‌లు ఆయన చూస్తే గెలిచే అవకాశం ఉందని కూడా కొందరు కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ భారత వీరాభిమానులు మాత్రం ఆనంద్ మహీంద్రా పరిస్థితిని అర్థంచేసుకున్నారు. తామూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Viral: భారత పర్యటనకు వచ్చిన అమెరికా మహిళ.. మనోళ్ల తీరుతో చిర్రెత్తుకొచ్చి.. చివరకు తనే స్వయంగా..
ఇక ప్రస్తుత మ్యాచ్‌లో కీలకమైన రోహిత్, గిల్, శ్రేయస్ ఇబ్బందుల్లో పడింది. అయితే, పిచ్ కొంత అనుకూలంగా ఉండటం క్రీజులో విరాట్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉండటం టీమిండియాకు ప్రస్తుతం కలిసొచ్చే అంశమని నిపుణులు అంటున్నారు.
Viral: ఎందుకిలా..? రైతు వీడియో చూసిన కన్‌ఫ్యూజన్‌లో ఆనంద్ మహీంద్రా ప్రశ్న! జరిగిందేంటంటే..