School Teacher Arrest: కీచక ఉపాధ్యాయుడికి బుద్ధి చెప్పిన పోలీసులు..
ABN , Publish Date - Mar 08 , 2025 | 09:57 PM
విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధాయ్యుడికి నిర్మల్ జిల్లా పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. నిందితుడుని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

నిర్మల్: విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధాయ్యుడు అరెస్టయిన ఘటన నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి)లో చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న గణిత ఉపాధ్యాయుడు మనోహర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఉపాధ్యాయుడు మోహన్ రావు పరారీలో ఉండగా.. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వీరిద్దరూ కలిసి కొన్ని నెలలుగా విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
ఇష్టమెుచ్చినట్లు తాకుతూ.. డబుల్ మీనింగ్ డైలాగులతో చిన్నారులను భయబ్రాంతులకు గురి చేశారు. వారి వేధింపులు తాళలేక ఫిబ్రవరి 4న విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారంతా పెద్దఎత్తున పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇద్దరు టీచర్లతోనూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషన్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అయితే హెచ్ఎమ్ మాత్రం వారిపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన బాధితులు కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన డీఈవో.. ఉపాధ్యాయులు మోహన్ రావు, మనోహర్ రెడ్డి విద్యార్థినిలతో తప్పుగా ప్రవర్తించారని నిర్ధారించారు. ఈ మేరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్‍ఎమ్‍తోపాటు టీచర్లిద్దరినీ సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు మనోహర్ రెడ్డిపై గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. పని చేసిన ప్రతి చోటా స్టూడెంట్స్‍తో ఇలానే ప్రవర్తించినట్లు సమాచారం. ఈ మేరకు పలువురు తల్లిదండ్రులు సైతం అతనిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా, తప్పుడు పనులు చేసి ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చారని పలువురు వారిపై మండిపడుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలకు ఎవ్వరూ పాల్పడకుండా తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..
Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..