Anand Mahindra: కష్టాలను ఎలా దాటాలో ఈ ఏనుగును చూసి నేర్చుకోండి.. స్ఫూర్తిదాయక ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా!
ABN, First Publish Date - 2023-08-06T10:15:04+05:30
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తనకు నచ్చిన ఆసక్తికర విషయాలను, ఫన్నీ వీడియోలను ట్విటర్లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన మోటివేషనల్ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తనకు నచ్చిన ఆసక్తికర విషయాలను, ఫన్నీ వీడియోలను ట్విటర్లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన మోటివేషనల్ వీడియో (Motivational Video) చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో మళ్లీ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఏనుగు (Elephant) రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తోంది. అయితే రోడ్డు దాటడానికి కంచె అడ్డంగా ఉంది. ఆ కంచెను ఒకేసారి కూల్చేయకుండా దానికి కరెంట్ ఉందేమో అని చెక్ చేసింది. ముందుగా కాలితో కంచెను తాకి ఏ ప్రమాదమూ లేదని నిర్ధారించుకున్న తర్వాతే కంచెను పడగొట్టింది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేసి స్ఫూర్తిదాయక కామెంట్లు చేశారు. ``అడ్డంకులను ఎలా ఎదుర్కోవాలో తెలిపే అద్భుతమైన వీడియో. ముందుగా మనకు ఎదురయ్యే సవాలు ఎంతో పెద్దదో జాగ్రత్తగా పరిశీలించాలి. దాని బలం తెలుసుకున్నప్పుడే ఎలా దాటాలో అర్థమవుతోంది. అప్పుడే విజయం స్వంతమవుతుంద``ని ఆనంద్ కామెంట్ చేశారు (Elephant overcoming obstacle).
Viral: రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు అద్దాలపై అంటించి ఉందో పేపర్.. ఏం రాసి ఉందా అని అంతా చదివిన యజమానికి..!
ఆనంద్ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 8 లక్షల మందికి పైగా వీక్షించారు. 12 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``కేవలం దిగ్గజాలు మాత్రమే చిన్న విషయాల నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటారు``, ``మీరు ఎల్లప్పుడూ అందరిలోనూ స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తారు`` అంటూ ఆనంద్పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు
Updated Date - 2023-08-06T10:15:04+05:30 IST