Viral Video: ట్విటర్‌లో ఓ 5 ఏళ్ల బాలిక వీడియోను పోస్ట్ చేస్తూ ఆనంద్ మహీంద్రా షాకింగ్ కామెంట్స్.. నేను భయపడను అంటూనే..
ABN, First Publish Date - 2023-04-25T13:06:26+05:30
సోషల్ మీడియాలో (Social Media) చాలా యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) నెట్టింట షేర్ చేసే విషయాలు.. వాటి తాలూకు ఫొటోలు, వీడియోలు సమ్‌థింగ్ స్పెషల్‌గా (Something Sepecial) ఉంటాయనే విషయం తెలిసిందే.
Social Media Viral Video: సోషల్ మీడియాలో (Social Media) చాలా యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) నెట్టింట షేర్ చేసే విషయాలు.. వాటి తాలూకు ఫొటోలు, వీడియోలు సమ్‌థింగ్ స్పెషల్‌గా (Something Sepecial) ఉంటాయనే విషయం తెలిసిందే. ఇదే కోవలో ఆయన తాజాగా మరో ప్రత్యేకమైన వీడియోను ట్విటర్‌లో (Twitter) పోస్ట్ చేశారు. ఈసారి ఆయన కృత్రిమ మేధస్సుకు (Artificial Intelligence) సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు. అదే సమయంలో ఆ వీడియోపై ఆయన షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఈ వీడియోలో ఓ బాలిక 5 ఏళ్ల వయసు నుంచి 95 ఏళ్ల వృద్ధురాలిగా మారడాన్ని చూపించారు.
ఇక వీడియోను ఆయన తన ఖాతా ద్వారా ట్వీట్ చేస్తూ.. "వరుస క్రమంలో మారే ఈ వీడియో కృత్రిమమేధ(AI) సాయంతో రూపుదిద్దుకుంది. ఇందులో ఒక అమ్మాయి 5ఏళ్ల వయసు నుంచి 95 ఏళ్ల వయసు వరకు ఎలా మారుతుందనేది చూడొచ్చు. నేను ఏఐ గురించి ఎక్కువగా ఆందోళన చెందడంలేదు. ఎందుకంటే అది ఎంతో అందమైన వాటిని సృష్టిస్తోంది" అని అన్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 2,25,000 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'ఇది రియాలిటీకి దగ్గరగా ఉంది','నిజంగా చాలా బాగుంది. కానీ, ఇది మనషి మేధస్సు, పని తననాన్ని తీసుకెళ్లిపోతుంది. ప్రపంచం ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొబోతుంది','ఏఐ ఫిక్షన్ సినిమాలాంటిది. మనిసి మెదడు దర్శకుడి లాంటిది. దర్శకుడు లేకుండా ఏఐ లేదు' అని కామెంట్స్ పెడుతున్నారు.
Viral Video: నడిరోడ్డుపై ఓ యువతిని వేధిస్తున్న కుర్రాడు.. సడన్‌గా వచ్చి పక్కనే ఆగిన బస్సులోంచి దిగిన నలుగురు వ్యక్తులు.. చివరకు షాకింగ్ సీన్..!
Updated Date - 2023-04-25T13:06:26+05:30 IST