Crime News: ఛీ.. ఈ మహిళ భార్య అనే పేరుకే కళంకం.. ఎంత ఘోరానికి పాల్పడిందో తెలిస్తే తిట్టిపోస్తారు
ABN, First Publish Date - 2023-08-20T18:35:58+05:30
మగువలు తమ జీవితంలో ప్రధానంగా కోరుకునేది ఏంటి? తమని ప్రేమగా చూసుకునే భర్త రావాలని! అలాంటి వ్యక్తి తమ జీవితంలోకి వస్తే చాలు.. సంతోషంగా దాంపత్య జీవితం...
మగువలు తమ జీవితంలో ప్రధానంగా కోరుకునేది ఏంటి? తమని ప్రేమగా చూసుకునే భర్త రావాలని! అలాంటి వ్యక్తి తమ జీవితంలోకి వస్తే చాలు.. సంతోషంగా దాంపత్య జీవితం గడుపుతారు. అసలు ప్రపంచంతో సంబంధమే లేదన్నట్టుగా.. భర్త, పిల్లలే సర్వస్వమన్నట్టుగా జీవిస్తారు. కానీ.. ఇంత మంచి జీవితం లభించినప్పటికీ కొందరు మహిళలు పక్కదారి పడుతుంటారు. తమ కామవాంఛ తీర్చుకోవడం కోసం.. పరాయి మగాళ్లపై మోజు పెంచుకుంటుంటారు. చివరికి తమ భర్త, కుటుంబాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇంకొందరైతే ఒక అడుగు ముందుకేసి.. కట్టుకున్న భర్తల్నే కడతేర్చుతుంటారు. ఇప్పుడు ఓ మహిళ కూడా అలాంటి ఘాతుకానికే పాల్పడింది. తన ప్రియుడితో కలిసి ఉండేందుకు.. అడ్డుగా ఉన్నాడని భర్తని హతమార్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని పల్నాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో నివాసం ఉండే ఎబ్బిలి వెంకటేశ్వర్లు (32)కి పదేళ్ల క్రితం సంగుపాలెం కోడూరుకి చెందిన గౌరీతో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వర్లు ముఠా కార్మికుడిగా పని చేస్తుండగా.. భార్య ఇంట్లోనే ఉంటుంది. వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది కానీ, ఒక వ్యక్తి రాకతో ఒక్కసారిగా మలుపు తిరిగింది. స్థానికంగా కారు డ్రైవర్గా పని చేసే పల్లపు సుబ్రహ్మణ్యంతో గౌరీకి అనుకోకుండా పరిచయం ఏర్పడగా.. కొన్ని రోజుల్లోనే అది వివాహేతర సంబంధంగా మారింది. మొదట్లో తమ గుట్టు తెలియకుండా రహస్యంగా రాసలీలలు కొనసాగించారు. అయితే.. కొంతకాలానికి వీరి బాగోతం బయటపడింది. అప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. మరోసారి తాము ఈ తప్పు చేయమని చెప్పడంతో.. భర్త ఆమెను క్షమించి, తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు.
అయినప్పటికీ భార్య గౌరీ ప్రవర్తనలో మార్పు రాలేదు. తన ప్రియుడు సుబ్రహ్మణ్యంతో వివాహేతర సంబంధం కొనసాగించింది. జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్నారు. అందుకు భర్త అడ్డుగా ఉండటంతో.. అతడ్ని చంపాలని ప్లాన్ వేశారు. శుక్రవారం వెంకటేశ్వర్లు మద్యం సేవించి ఇంటికొచ్చి నిద్రపోగా.. ప్లాన్ ప్రకారం గౌరీ, సుబ్రహ్మణ్యం కలిసి గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత తన భర్తది సహజమరణంగా చిత్రీకరించేందుకు గౌరీ ప్రణాళిక రచించింది. అయితే.. వెంకటేశ్వర్లు గొంతు, శరీరంపై గాయాలు ఉండటంతో గౌరీపై అనుమానం కలిగింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఆ గాయాల ఆధారంగా గౌరీని అదుపులోకి తీసుకొని విచారించారు. అప్పుడు ప్రియుడి కోసమే భర్తని హతమార్చినట్టు ఆమె అంగీకరించింది. మరోవైపు.. సుబ్రహ్మణ్యం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-08-20T18:35:58+05:30 IST