ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crypto: 90 రోజుల్లో లక్షను 4 లక్షలు చేస్తామన్నారు.. మరి ఏం జరిగింది?

ABN, First Publish Date - 2023-02-15T16:34:35+05:30

చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు.. వేలకు లక్షలు.. లక్షలకు కోట్లు సంపాదించొచ్చంటూ వల వేస్తున్నారు కేటుగాళ్లు. అవగాహనలేమితో మోసపోయిన బాధితుల ఉదంతాలు చాలానే వెలుగుచూస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు.. వేలకు లక్షలు.. లక్షలకు కోట్లు సంపాదించొచ్చంటూ వల వేస్తున్నారు కేటుగాళ్లు. అవగాహనలేమితో మోసపోయిన బాధితుల ఉదంతాలు చాలానే వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా.. ప్రభుత్వ ఏజెన్సీలు ఎంత హెచ్చరిస్తున్నా ఏదోరూపంలో అమాయక జనాలను కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలో ఈ తరహా ఘటనే ఒకటి వెలుగుచూసింది.

క్రిప్టో కరెన్సీ (Crypto Currency) పేరిట భారీ మోసం జరిగింది. లక్ష రూపాయలు ఇన్వెస్ట్ (Investment) చేస్తే 90 రోజుల్లో 4 లక్షలు చేస్తామంటూ ఎక్స్‌సీఎస్‌పీఎల్ (XCSPL) అనే కంపెనీ మాయమాటలు పలికింది. నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. డబ్బుపై ఆశతో అమాయక జనాలు అప్పు చేసి, లోన్ తీసుకుని, క్రెడిట్ కార్డు ద్వారా కొందరు ఇలా లక్షల రూపాయల మేర ఇన్వెస్ట్ చేశారు. అయితే వీళ్లంతా మోసపోయారు. ఎక్స్‌సీఎస్‌పీఎల్ కంపెనీ మోసం చేసిందని బాధితులు వాపోతున్నారు. ఈ కంపెనీ ఆఫీస్ మంజీరా మాల్‌లోని 11వ ఫ్లోర్‌లో ఉందని చెబుతున్నారు. అప్పులు చేసి మరీ పెట్టుబడి పెడితే నిట్టనిలువునా ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Chandrababu: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం

కాగా బిట్‌కాయిన్‌, ఇథేరియమ్‌, ట్రాన్‌ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టాలంటూ కేటుగాళ్లు ప్రచారం చేస్తున్నారు. ఒకరిద్దరిని చేర్పిస్తే.. బేసిక్‌ సభ్యత్వం..ఆ ఇద్దరు మరో ఇద్దరేసి వ్యక్తులను చేర్పిస్తే.. మొదటి వ్యక్తికి స్టాండర్డ్‌ సభ్యత్వం.. ఇలా అడ్వాన్స్‌డ్‌, ప్రీమియం, క్రౌన్‌, కోర్‌, ప్లాటినం పేర్లతో సీనియారిటీ పెరుగుతుందని నమ్మబలుకుతున్నారు. పెట్టుబడి డాలర్ల రూపంలో ఉంటుందని చెబుతున్నారు. 50 నుంచి 10 వేల అమెరికా డాలర్లు పెట్టవచ్చని ముగ్గులోకి దింపుతున్నారు. అయితే పెట్టుబడులు పెరిగిన తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-02-15T17:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising