Ballary: నాగుపాముకే పూజలు చేసిన భక్తులు...
ABN, First Publish Date - 2023-08-22T10:11:55+05:30
శ్రావణ మాసం పంచమిని పురస్కరించుకుని సోమవారం జిల్లా వ్యాప్తంగా పూజలు నిర్వహించారు. అయితే సాధారణంగా నాగుల చవితి,
బళ్లారి(బెంగళూరు): శ్రావణ మాసం పంచమిని పురస్కరించుకుని సోమవారం జిల్లా వ్యాప్తంగా పూజలు నిర్వహించారు. అయితే సాధారణంగా నాగుల చవితి, నాగ పంచమి(Nagula Chavithi, Naga Panchami)ని పురస్కరించుకుని సమీపంలోని ఉన్న రాతి విగ్రహాలకు, పాముపుట్టలకు పాలుపోసి నాగుల చవితి జరుపుకోవడం ఆచారం. అయితే జీవించి ఉన్న నాగుపామును పళ్ళెంలో పెట్టి నాగపంచమిని ఆచరించి తన భక్తిని చాటుకున్నాడు ప్రశాంత్ కుటుంబీకులు. ఉత్తర కన్నడ జిల్లా, శిరిసి తాలూకాకు చెందిన ప్రశాంత్ హులేకర్ అనే వ్యక్తి నాగ పంచమిని ఆచరించారు. అతని ప్రవృత్తి పాములను రక్షించడం. ఊరిలో ఎక్కడ పాము కనిపించినా టక్కున ప్రశాంత్‌నే పిలుస్తారు. ఎక్కువగా అటవీశాఖ అధికారులే ప్రశాంత్‌కు పాములను పట్టించి అడువుల్లో వదిలే పని అప్పగించారు. అలాగా పాముల సంతతిని కాపాడడంతో పాటు వాటి రక్షించడం మనందరి బాధ్యతతో పాటు నాగ పంచమి రోజున పాముల పట్ల జనజాగృతి చేసే పనిని ప్రతి యేటా చేస్తూ వస్తుంటాడు ప్రశాంత్. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నాగపంచమి రోజున ప్రాణంతో ఉన్న నిజమైన పాముకే పూజలు నిర్వహించి పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. పాములు అంటే తనకు అమితమైన భక్తిగా చెప్పుకొస్తూ... చుట్టు ప్రక్కల ప్రజలు పాముల గురించి సమాచారం ఇస్తూ వాటిలో పాముల సంతతిని కాపాడడంలో జాగృతి చేస్తున్నట్లు తెలుపుతున్నారు. తన భక్తే తనను కాపాడుతుందంటున్నారు.
Updated Date - 2023-08-22T10:11:55+05:30 IST