ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bengalore: ఓయమ్మో.. ఎంత పెద్ద కొండచిలువో..!

ABN, First Publish Date - 2023-08-05T12:27:39+05:30

కొండచిలువ అంటే సాధారణంగా 10 నుంచి 15 అడుగులకు అటుఇటుగా చూస్తుంటాం. కానీ బళ్లారి(Bellary) నగరం కౌల్‌బజార్‌ సమీపంలోని

బళ్లారి, (ఆంధ్రజ్యోతి): కొండచిలువ అంటే సాధారణంగా 10 నుంచి 15 అడుగులకు అటుఇటుగా చూస్తుంటాం. కానీ బళ్లారి(Bellary) నగరం కౌల్‌బజార్‌ సమీపంలోని సూర్యకాలనీ వద్ద గురువారం రాత్రి సుమారు 35 నుంచి 40 అడుగుల పొడవు గల ఓ కొండచిలువ రోడ్డు దాటుతూ కనిపించింది. దానిని చూస్తేనే ఒళ్లు జలదరించేలా ఉంది. ఆ సమయంలో అటువైపు కారులో వెళుతున్న వాళ్లు దానిని చూసి భయంతో నిలిచిపోయారు. కొద్ది దూరంలో కారు ఆపేసి కొండ చిలువ వీడియో తీసి ఆటవీశాఖ అధికారుల సమాచారం అందించారు. ఇంత పెద్ద కొండచిలువ సాధారణంగా కొండ ప్రాంతాల్లో ఉంటుంది. కానీ ఊరిలోకి రావడంపై జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందనే దానిపై ఆటవీశాఖ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. సండూరు గనుల ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొండచిలువ బళ్లారి నగరంలోని సూర్య కాలనీ వద్ద ఉన్న ఒక డ్రైనేజీలో చేరుకుంది. దీన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2023-08-05T12:27:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising