Bank holidays in March 2023: మార్చి నెలలో బ్యాంకులకు ఇన్ని సెలవులా..? ఈ నెలలో ఎన్ని పండుగలు ఉన్నాయంటే..
ABN , First Publish Date - 2023-03-01T09:30:36+05:30 IST
ఈ వేసవిలో కష్టపడి బ్యాంకుకు వెళ్ళినప్పుడు బ్యాంక్ క్లోజ్ లో ఉంటే ఏడుపు తన్నుకొస్తుంది. అందుకే
అసలే వేసవి మొదలయ్యింది. ఈ ఎండలకు బయటకు వెళ్ళి పనులు చేసుకోవాలంటే కాస్త చిరాగ్గానే ఉంటుంది. కానీ బ్యాంకు పనులు చక్కబెట్టుకోవాలంటే వెళ్ళక తప్పదు. కష్టపడి బ్యాంకుకు వెళ్ళినప్పుడు బ్యాంక్ క్లోజ్ లో ఉంటే ఏడుపు తన్నుకొస్తుంది. అందుకే మీకు బ్యాంకులలో ఆర్థిక లావాదేవీలు ఉంటే మాత్రం ఈ నెలలో అలెర్ట్ గా ఉండండి. ఎందుకంటే పండుగలు, ఆదివారాలు, రెండవ నాలుగవ శనివారాలు అంటూ బ్యాంకులకు ఈనెలలో బాగానే సెలవులు వచ్చాయి. ఈ సెలవుల గురించి తెలుసుకుంటే మనం ఎప్పుడు వెళ్ళచ్చు, ఎప్పుడు పనులు చేసుకోవచ్చు అనేది సులువు అవుతుంది. బ్యాంకులకు మార్చి నెలలో ఏకంగా 12రోజుల సెలవులున్నాయి. అంటే 31రోజులలో 12సెలవులు తీసేస్తే 19రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. ఇంతకూ బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులున్నాయో చూస్తే..
మార్చి 3 : మార్చి 3వ తేదీన చప్తార్ కుట్ సందర్భంగా సెలవుదినం.
మార్చి 7: మార్చ్ 7వ తేదీన హోలీ పండుగ సందర్భంగా సెలవుదినం ఉంది.
మార్చి 8: మార్చి 8వ తేదీన హోలీ పండుగ రెండవ రోజు సెలవుదినం.
మార్చి 9: మార్చి 9వ తేదీ హోలీ పండుగ సెలవుదినం.
మార్చి 22: మార్చి 22 వతేదీన ఉగాది పండుగ.
మార్చి 30: మార్చి 30వ తేదీన శ్రీరామ నవమి పండుగ.
వీటి సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ సెలవు దినాలు రాష్ట్రాలను బట్టి మారతాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాలలో ఇన్నిరోజులు సెలవులు లేవు. కేవలం హోలీ పండుగ సందర్భంగా 7వ తేదీ, ఉగాది పండుగ సందర్భంగా 22వ తేదీ, శ్రీరామ నవమి సందర్భంగా 30 వతేదీ మొత్తం మూడురోజులు పండుగ సెలవులు ఉన్నాయి. వీటితో పాటు బ్యాంకులకు ఆదివారాలు, రెండవ నాలుగవ శనివారాలు సెలవు ఉంటుంది. మార్చి నెలలో ఆదివారాలు, రెండవ నాలుగవ శనివారాలు ఏయే తేదీల్లో వచ్చాయో చూస్తే..
మార్చి 5, 2023: ఆదివారం
మార్చి 11, 2023: శనివారం
మార్చి 12, 2023: ఆదివారం
మార్చి 19, 2023: ఆదివారం
మార్చి 25, 2023: శనివారం
మార్చి 26, 2023: ఆదివారం
తెలుగు రాష్ట్రాలలో ఉన్న బ్యాంకులకు మొత్తం 9రోజులు సెలవు దినాలున్నాయి. వీటిని అనుసరించి పనులు చక్కబెట్టుకోడానికి ప్లాన్ చేసుకోండి.