Beer Omelette: నూనెకు బదులు బీరుతో ఆమ్లెట్.. ఎలా చేశారని డౌటా..? ఈ వీడియోను చూస్తే..!
ABN, First Publish Date - 2023-06-28T12:01:58+05:30
బీరు ప్రియులకు మాంచి కిక్కిచ్చేలా ఓ స్ట్రీట్ సెల్లర్ ఆమ్లెట్ తయారీలో నూనెకు బదులుగా బీరు వాడుతున్నాడు..
అందరూ తినే పోషకమైన ఆహారంలో గుడ్లు కూడా ఒకటి. చాలామంది గుడ్లతో ఆమ్లెట్ చేసుకుని తినడానికి ఇష్టపడతారు. డబుల్ ఆమ్లెట్ అనీ, హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ అనీ, వెజిటబుల్ ఆమ్లెట్ అనీ వినే ఉంటారు. కానీ ఎప్పుడైనా బీర్ ఆమ్లెట్ అనే పేరు విన్నారా? బీర్ అనే పేరు చెబితే కుర్రాళ్ళ కళ్ళలో మెరుపులు కనబడతాయి. అలాంటిది బీర్ ఆమ్లెట్ అంటే కాస్త థిల్లింగానూ, మరింత విస్తుపోయేలానూ ఉంది. బీరు ప్రియులకు మాంచి కిక్కిచ్చేలా ఓ స్ట్రీట్ సెల్లర్ ఆమ్లెట్ తయారీలో నూనెకు బదులుగా బీరు వాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
కొత్తదనంతో కస్టమర్లను ఆకర్షించాలని నేటి ఆహార విక్రేతలు(food sellers) ప్రయోగాలు చేస్తుంటారు. మొన్నటికిమొన్న ఆమ్లెట్ లో ఫ్రూటీని మిక్స్ చేసి ఆమ్లెట్ అంటే భయపడేలా చేశాడు ఓ విక్రేత. అయితే ఇప్పుడు బీర్ ఆమ్లెట్(beer amlette) వైరల్ గా మారింది. వీడియోలో స్ట్రీట్ సెల్లర్ బీర్ బాటిల్ ఓపెన్ చేసి పెనం మీద పోయడంతో ఈ ఆమ్లెట్ తయారీ మొదలవుతుంది. అతను ముందుగానే గుడ్డుసొనలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం వంటివి వేసి బాగా గిలక్కొట్టి సిద్దం చేసుకున్నాడు. కాలుతున్న పెనం మీద బీరు పోసాక గుడ్డు సొన వేశాడు. దీన్ని పెనం మీద విస్తరించి దీని చుట్టూ ఆయిల్ కు బదులుగా బీరు పోశాడు(beer instead of oil). ఆ బీరులో ఉడుకుతున్న ఆమ్లెట్ ను తిప్పేసి దాన్ని బుర్జీలాగా మాష్ చేశాడు. అది బాగా కాలిన తరువాత దాన్ని ప్లేట్ లోకి వేసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాడు. బీరు ప్రియులు ఈ బీరు ఆమ్లెట్టును లొట్టలు వేసుకుంటూ లాగిస్తున్నారు.
Crime: కొడుకు ఆర్మీ ఆఫీసర్ అయ్యాడని తల్లిదండ్రులు కూడా నమ్మేశారు.. అదే చెప్పి పెళ్లి కూడా చేశారు.. కానీ ఒక్క మిస్టేక్‌తో..
ఈ వీడియోను foodiee_sahab అనే ఇన్స్టాగ్రామ్ పేజీ(Instagram page) నుండి ఓ ఫుడ్ వ్లాగర్ షేర్ చేశాడు. ఈ బీరు ఆమ్లెట్ చూశాక నెటిజన్లు సెటైర్లు, పంచులతో కామెంట్స్ చేస్తున్నారు. 'యాక్స్ పెర్ఫ్యూమ్ ఆమ్లెట్ కోసం ఎదురుచూస్తున్నాను నేను' అని ఒక వినియోగదారు పంచ్ వేసాడు. 'కాస్త ఆలోచిస్తే ఆల్కహాల్ వేడిమీద ఆవిరైపోతుంది. అది నీటి ఆమ్లెట్ అని చెప్పవచ్చు' అని ఇంకొకరు లాజిక్ తీశారు. 'భలే ఉంది భయ్యా చూస్తుంటే నోరూరుతోంది' అని బీరు ప్రియులు స్పందిస్తున్నారు.
Eggs vs Paneer: కోడిగుడ్లు మంచిదా..? పనీర్ వాడటం బెస్టా..? బరువు తగ్గాలనుకునే వాళ్లు ఏది వాడాలంటే..!
Updated Date - 2023-06-28T12:01:58+05:30 IST