ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఐ ఫోన్ కొనడానికి వెళ్లిన భిక్షగాడు.. దుకాణంలో అందరికీ షాక్ ఇస్తూ.. చివరకు ఏం చేశాడో చూడండి..

ABN, First Publish Date - 2023-10-19T19:03:21+05:30

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో కొందరు తాము చేసే రోజువారీ పనులను వీడియోలుగా మార్చి.. తద్వారా డబ్బులు సంపాదించడం సర్వసాధారణమైంది. ఇంకొందరు ప్రాంక్ వీడియోలు, సోషల్ ఎక్స్పరిమెంట్‌.. ఇలా ఏవేవో వీడియోలు చేస్తూ కూడా ఆదాయాన్ని గడిస్తున్నారు. అయితే..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో కొందరు తాము చేసే రోజువారీ పనులను వీడియోలుగా మార్చి.. తద్వారా డబ్బులు సంపాదించడం సర్వసాధారణమైంది. ఇంకొందరు ప్రాంక్ వీడియోలు, సోషల్ ఎక్స్పరిమెంట్‌.. ఇలా ఏవేవో వీడియోలు చేస్తూ కూడా ఆదాయాన్ని గడిస్తున్నారు. అయితే ఇలాంటి పనులు కొన్నిసార్లు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని సార్లు చిరాకును తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ భిక్షగాడి వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఐ ఫోన్ కొనడానికి దుకాణానికి వెళ్లిన భిక్షగాడు.. చివరకు ఏం చేశాడో చూడండి..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో (Rajasthan Jodhpur) ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఓ రద్దీ ప్రాంతంలో ఐ ఫోన్ దుకాణం (iPhone store) వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శరీరం మొత్తం మట్టికొట్టుకుపోవడంతో పాటూ చిరిగిపోయిన దుస్తులతో ఉన్న ఓ భిక్షగాడు.. పాత మూట పట్టుకుని సెల్ ఫోన్ దుకాణం వద్దకు వస్తాడు. డోర్లు తోసుకుంటూ లోపలికి వెళ్తాడు. దీంతో అక్కడే ఉన్న ఓ యువతి.. ‘‘ఈ భిక్షగాడేంటీ... ఇలా లోపలికి వస్తున్నాడు’’.. అని వింతగా చూస్తుంది. మూటను పట్టుకుని లోపలికి వెళ్లిన అతన్ని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొందరు అసహ్యించుకుంటారు. ఇలా లోపలికి వెళ్లిన అతను.. (begga went to buy an iPhone) తనకు ఐఫోన్-15 చూపించమని అడుగుతాడు. దుకాణం సిబ్బంది షాక్ నుంచి తేరుకోకముందే ఆ భిక్షగాడు తన వద్ద ఉన్న మూటను విప్పి కింద పోస్తాడు.

Viral Video: బుల్లెట్ బైకుపై మహిళ భయంకర స్టంట్.. మగవారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఒంటి చేత్తో..

చివరకు మూట నిండా చిల్లర (sack of coins) ఉండడం చూసి అంతా అవాక్కవుతారు. చిల్లర తీసుకుని మొబైల్ ఇచ్చేందుకు దుకాణ యజమాని అంగీకరించడంతో సిబ్బంది మొత్తం చిల్లరను లెక్కపెట్టేపనిలో పడతారు. చివరకు సిబ్బంది అంతా ఎలాగోలా చిల్లరను మొత్తం లెక్కించేస్తారు. అనంతరం షాపు యజమాని అతడికి ఐఫోన్ ప్రో మ్యాక్స్ మొబైల్ అందిస్తాడు. అయితే, సోషల్ ఎక్స్పరిమెంట్‌లో భాగంగా ఓ యూట్యూబర్ ఇందంతా చేసినట్లు తెలియడంతో చివరకు అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కాన్సెప్ట్ బాగుంది బ్రదర్’’.. అని కొందరు, ‘‘ఫవర్ ఆఫ్ ఐఫోన్’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటివి ఇటీవల సర్వసాధారణం’’.. ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 43లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వధువును నిండా ముంచిన వింత సాంప్రదాయం.. పెళ్లిపీటలపై ఉన్నట్టుండి ఓ వ్యక్తి చేసిన పని చూడండి..

Updated Date - 2023-10-19T19:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising