ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking Incident at IKEA: ఐకియా స్టోర్‌‌లో షాకింగ్ ఘటన.. స్నాక్స్ తింటుండగా పైనుంచి టేబుల్‌పై పడిన ఎలుక కళేబరం..!

ABN, First Publish Date - 2023-07-18T13:50:20+05:30

బెంగళూరు (Bengaluru) పరిధిలోని నాగసంద్రలో ఉన్న ఐకియా స్టోర్‌ (IKEA Store) లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Shocking Incident at IKEA: బెంగళూరు (Bengaluru) పరిధిలోని నాగసంద్రలో ఉన్న ఐకియా స్టోర్‌ (IKEA Store) లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్టోర్‌‌లో స్నాక్స్ తింటుండగా శరణ్య షెట్టి అనే మహిళకు భయంకరమైన అనుభవం ఎదురైంది. స్టోర్‌‌లోని ఫుడ్‌కోర్టులో ఆమె టేబుల్‌‌పై పైకప్పు నుంచి ఎలుక కళేబరం పడింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన ఆమె వెంటనే తేరుకొని తాను తింటున్న స్నాక్స్ పక్కనే పడివున్న చచ్చిన ఎలుక ఫొటో తీసి ట్విట్టర్‌ లో షేర్ చేసింది. ‘నా ఫుడ్ టేబుల్‌‌పై ఏం పడిందో ఊహించగలరా.. మేము తింటున్న సమయంలో ఈ చచ్చిన ఎలుక పడింది చూడండి. ఎప్పటికీ మరిచిపోని ఘటన’ అనే లైన్స్‌ను ట్వీట్‌కు జోడించింది. దాంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

ఇక శరణ్య ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు ఐకియాపై విమర్శలకు దిగారు. దాంతో స్పందించిన ఐకియా యాజమాన్యం శరణ్యకు ఎదురైన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. దీనిపై తాము దర్యాప్తు చేస్తామని తెలిపింది. అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. అంతేగాక ఎల్లప్పుడూ తాము పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది.

Tamil Nadu: కుమారుడి కాలేజీ ఫీజు చెల్లించేందుకు.. తల్లి షాకింగ్ నిర్ణయం.. హృదయాన్ని బరువెక్కించే ఘటన..!


Updated Date - 2023-07-18T13:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising