ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Farah Khan: ‘నాటు నాటు’ డ్యాన్స్ స్పెషల్ ఎఫెక్ట్స్‌తో చేసినట్టు ఉంటుంది

ABN, First Publish Date - 2023-01-22T15:29:14+05:30

బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ (Farah Khan) ‘ఆర్ఆర్ఆర్’ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటలోని డ్యాన్స్ స్పెషల్ ఎఫెక్ట్స్‌తో చేసినట్టు ఉంటుందని స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శక ధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీకి విదేశీ ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫలితంగా ఈ సినిమా ఆస్కార్ బరిలోను నిలిచింది. అకాడమీ నామినేషన్స్‌ తేదీ దగ్గర పడిన నేపథ్యంలో బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ (Farah Khan) ‘ఆర్ఆర్ఆర్’ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటలోని డ్యాన్స్ స్పెషల్ ఎఫెక్ట్స్‌తో చేసినట్టు ఉంటుందని స్పష్టం చేసింది.

‘‘కొరియోగ్రఫీలో ఏదైనా బహుమతి ఉంటే ‘ఆర్ఆర్ఆర్’ కు తప్పకుండా ఇవ్వాలి. ఎవరు ఆ విధంగా డ్యాన్స్ చేస్తారు..? ఆ డ్యాన్స్ స్పెషల్ ఎఫెక్ట్స్‌తో చేసినట్టు ఉంటుంది. లాస్ ఏంజెలెస్‌లోని నా స్నేహితులు సినిమాను చూసి మైమరచిపోయారు. అద్భుతంగా ఉందని పొగిడారు. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్‌కు నామినేట్ కావాలి. బాహుబలికి కూడా ఈ పురస్కారం గతంలోనే రావాలి. భారతీయ సినిమాలకు విదేశాల నుంచి ప్రశంసలు లభించాల్సిన అవసరం లేదు. మన చిత్రాలను పొగడటానికి చాలా మంది ఇండియాలోనే ఉన్నారు’’ అని ఫరా ఖాన్ పేర్కొంది. ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్‌ను సాధించిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వస్తే.. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీత రామరాజు, కొమురం భీమ్‌లను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. 1920ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2023-01-22T15:32:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising