Dog Saves Owner: యజమానిని పాము కాటు నుంచి కాపాడిన శునకం
ABN, First Publish Date - 2023-03-11T10:31:25+05:30
విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన శునకం నల్ల తాచు పాము బారి నుంచి తన యజమానిని కాపాడిన ఘటన ...
క్వీన్స్‌బర్గ్(దక్షిణాఫ్రికా): విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన శునకం నల్ల తాచు పాము బారి నుంచి తన యజమానిని కాపాడిన ఘటన తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది.(Brave Dog Saves Owner)అత్యంత ప్రమాదకరమైన నల్ల తాచు పాము(Black Mamba Snake) బారి నుంచి తన యజమానిని కాపాడిన శునకం ఘటన జంతుప్రేమికుల్లో సంతోషాన్ని నింపింది.
దక్షిణాఫ్రికా దేశంలోని క్వీన్స్‌బర్గ్‌లోని ఎస్కాంబ్‌లో ఓ వ్యక్తి మంచంపై పడుకున్నాడు. మంచం కింద నల్ల తాచుపాము పాగా వేసింది.( Snake Hiding Behind Couch) అంతే పామును చూసిన శునకం మొరుగుతూ తన యజమానిని హెచ్చరించింది. దీంతో యజమాని మంచంపై నుంచి లేచి కింద చూడ పాము కనిపించింది. దీంతో పాములు పట్టే వ్యక్తిని పిలిచాడు.
ఇది కూడా చదవండి : Anushka Virat Kohli:అనుష్కతో ప్రేమలో పడ్డాక నా జీవితమే మారింది: విరాట్ కోహ్లీ
దక్షిణాఫ్రికాకు చెందిన నిక్ ఎవాన్స్ అనే పాము పట్టేవాడు ఈ భయానక కథనాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. పాము మంచం కింద ఉన్న సంఘటన, తదుపరి రెస్క్యూ గురించి వివరించారు. అత్యంత విషపూరితమైన పాము బారి నుంచి తన యజమానిని అప్రమత్తం చేయడంతో పాటు అతన్ని దూరంగా నెట్టి పాముపై దాడికి యత్నించింది. యజమాని ప్రాణాలు కాపాడిన శునకం ఘటన జంతుప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Updated Date - 2023-03-11T10:31:25+05:30 IST