ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bride: కాసేపట్లో పెళ్లనగా భారీ షాకిచ్చిన వధువు.. అప్పటికప్పుడు వేరే యువతితో వరుడికి పెళ్లి.. ఎందుకిలా చేశావని ఆ వధువును నిలదీస్తే..!

ABN, First Publish Date - 2023-06-08T20:07:35+05:30

ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌కు చెందిన యువతికి మీర్జాపూర్‌కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. జూన్ 3న పెళ్లి జరిపించేలా ఇరు కుటుంబాల వారూ మాట్లాడుకున్నారు. పెళ్లి రోజు దగ్గరపడడంతో రెండు కుటుంబాల వారు ఏర్పాట్లలో మునిగిపోయారు. చూస్తుండగానే..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆశయాలు, లక్ష్యాల కోసం కొందరు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలో చాలా మంది లక్షల జీతాలను వదిలి సొంత వ్యాపారాలు పెట్టుకుంటుంటే.. మరికొందరు సుఖ సంతోషాలను పక్కనపెట్టి మరీ రాత్రింబవళ్లు లక్షసాధన కోసం కృషి చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఓ వధువు తీసుకున్న నిర్ణయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. కాసేపట్లో పెళ్లనగా వధువు అదృశ్యమైంది. దీంతో అప్పటికప్పుడు వరుడికి వేరే యువతిని ఇచ్చి వివాహం చేశారు. ఎందుకు ఇలా చేశావని చివరకు పారిపోయిన వధువును నిలదీయగా.. ఆమె ఏం చెప్పిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) జాన్‌పూర్‌కు చెందిన యువతికి (young woman) మీర్జాపూర్‌కు చెందిన యువకుడితో వివాహం (marriage) నిశ్చయమైంది. జూన్ 3న పెళ్లి జరిపించేలా ఇరు కుటుంబాల వారూ మాట్లాడుకున్నారు. పెళ్లి రోజు దగ్గరపడడంతో రెండు కుటుంబాల వారు ఏర్పాట్లలో మునిగిపోయారు. చూస్తుండగానే పెళ్లి రోజు వచ్చేసింది. దీంతో యువతి గ్రామానానికి బంధువులంతా చేరుకున్నారు. మరోవైపు వరుడు (groom) కూడా వధువు గ్రామానికి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి వధువు (bride) కనిపించకపోవడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Odisha Train Accident: ప్రమాదానికి సరిగ్గా 20 సెకన్ల ముందు.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో సీన్ ఇదీ.. ఓ పారిశుధ్య కార్మికుడు రైలును ఊడుస్తోంటే..!

చుట్టుపక్కల వెతికినా ఎక్కడా ఆమె కనిపించకపోవడంతో.. వరుడికి ఏం సమాధానం చెప్పాలా అని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు తమ కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు (bride Missing case) నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. మరోవైపు విషయాన్ని వరుడితో పాటూ అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. వధువు బంధువుల్లో వేరే యువతిని ఇచ్చి వివాహం చేసేలా మాట్లాడుకున్నారు. దీనికి అంతా అంగీకరించడంతో అదే ముహూర్థానికి వివాహం జరిగిపోయిది.

Bride: పాపం.. ఆ వరుడు.. పెళ్లి మండపంలో వధువు నిర్వాకానికి ఆ పెళ్లికొడుకు పరువు పోయిందిగా.. పెళ్లిచూపుల్లో సరిగ్గా చూడలేదంటూ..!

అయితే ఈ క్రమంలో పారిపోయిన వధువును గ్రామంలోని పాఠశాలలో పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా, తాను UPSCకి ప్రిపేర్ కావాలనుకుంటున్నానని, ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పినా వినిపించుకోకుండా పెళ్లికి బలవంతంగా ఒప్పించారని చెప్పింది. తానే ఇంటి నుంచి పారిపోయానని, ఎవరి బలవంతమూ లేదని యువతి తెలిపింది. అయితే ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు.. వధువు పారిపోవడం వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Viral: అమాయకంగా కనిపించే ఈ కుర్రాడి నిజస్వరూపం తెలిసి పోలీసులే నివ్వెరపోయారు.. అతడి వద్ద దొరికిన పెన్‌డ్రైవ్‌ను చెక్ చేస్తే..!

Updated Date - 2023-06-08T20:11:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising