ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bride: పెళ్లి వేదిక నుంచి కాలేజీకి పరుగెత్తుకుంటూ వచ్చిన వధువు.. ఆమెను చూసి అవాక్కైన మీడియా.. విషయం ఏంటని అడిగితే..!

ABN, First Publish Date - 2023-05-19T17:35:14+05:30

లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. వాటికి భయపడి కొందరు రాజీ పడి జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. మరికొందరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నిలబడి తమ కలలను సాకారం చేసుకుంటుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వార్తలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. వాటికి భయపడి కొందరు రాజీ పడి జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. మరికొందరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నిలబడి తమ కలలను సాకారం చేసుకుంటుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వధువుకు (bride) సంబంధించిన వార్త ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వధువు పెళ్లి వేదిక నుంచి కాలేజీకి పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఆమెను చూసి అంతా అవాక్కయ్యారు. విషయం ఏంటని ఆరాతీయగా చివరకు ఏం తెలిసిందంటే..

సోషల్ మీడియాలో వధువుకు సంబంధించిన వార్త (Viral news) వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన కృష్ణ రాజ్‌పుత్ అనే యువతి బీఏ (B.A) చివరి సంవత్సరం చదువుతోంది. ఈమెకు ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం (Marriage) నిశ్చయమైంది. మే 16న వివాహం జరగాల్సి ఉంది. అయితే అదే రోజు ఆమెకు సోషియాలజీ పరీక్ష కూడా ఉంది. ఎలాగైనా పరీక్ష రాసి పాస్ అవ్వాలనేది ఆమె ఆశయం. అలాగని పెళ్లిని వాయిదా వేసుకోవడం ఇష్టం లేక.. విషయం వరుడి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అంతా మద్దుత ఇవ్వడంతో పెళ్లి తంతు అవగానే స్నేహితులతో పాటూ నేరుగా కళాశాలకు వెళ్లింది.

Viral Video: జింకలను వేటాడుతూ నీళ్లలోకి దూకిన పులి.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..

పెళ్లి దుస్తుల్లో ఉన్న యువతిని చూసి అంతా అవాక్కయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక.. చివరకు ఆమెను ప్రశ్నిచంగా విషయం తెలిసింది. పరీక్ష (BA Exam) రాసిన అనంతరం వివిధ మీడియా చానళ్లు ఆమెతో ఇంటర్వ్యూ చేశాయి. ఈ సందర్భంగా యువతి మాట్లాడుతూ పెద్దలు కుదిర్చిన వివాహాన్ని వాయిదా వేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది. అదేవిధంగా పరీక్ష పాస్ కావాలనేది కూడా తన ఆశయని తెలిపింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు వధువును ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నాం’’.. అంటూ అంతా ఆమెకు బెస్ట్ విషెష్ చెబుతున్నారు.

Viral Video: అక్కడ స్పేస్ లేదు.. క్రియేట్ చేసుకున్నారు.. ఈ బైక్ వీడియో చూస్తే త్రివిక్రమ్ డైలాగ్ గుర్తుకురావడం ఖాయం..!

Updated Date - 2023-05-19T17:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising