కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్తున్న బస్సు.. ఇంజిన్ ముందు వైపు చూస్తే అవాక్కవడం ఖాయం..

ABN, First Publish Date - 2023-10-18T14:53:52+05:30

కొన్ని వాహనాలను చూస్తే విచిత్రంగా అనిపిస్తుంటుంది. మరికొన్ని వాహనాలను చూస్తే వింతగా అనిపిస్తుంటుంది. అలాగే ఇంకొన్ని వాహనాలను చూస్తే ‘‘అరే! ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. వివిధ రకాల వస్తువులతో వినూత్న వాహనాలను సిద్ధం చేయడం తరచూ చూస్తూ ఉంటాం. అలాగే...

Viral Video: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్తున్న బస్సు.. ఇంజిన్ ముందు వైపు చూస్తే అవాక్కవడం ఖాయం..

కొన్ని వాహనాలను చూస్తే విచిత్రంగా అనిపిస్తుంటుంది. మరికొన్ని వాహనాలను చూస్తే వింతగా అనిపిస్తుంటుంది. అలాగే ఇంకొన్ని వాహనాలను చూస్తే ‘‘అరే! ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. వివిధ రకాల వస్తువులతో వినూత్న వాహనాలను సిద్ధం చేయడం తరచూ చూస్తూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు రోడ్ల మీద తిరిగే వాహనాలను చూస్తే నవ్వు వస్తుంటుంది. ఇలాంటి వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై దూసుకెళ్తున్న బస్సును చూసి అంతా అవాక్కవుతున్నారు. దాని ముందు వైపు చూస్తే మీరు కూడా ఖంగుతింటారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ప్రయాణికులతో నిండిన ఓ బస్సు (bus) రోడ్డుపై రయ్యిన దూసుకెళ్తోంది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. బస్సు ముందు వైపు చూసి అంతా అవాక్కవుతున్నారు. బస్సును వెనుక నుంచి చూసి ముందుగా ఎవరికి ఎలాంటి సందేహం రాలేదు. అయితే బస్సు ఇంజిన్ వైపు చూడగా అందులో డ్రైవర్‌, ఇంజిన్ (bus without driver and engine) లేకపోవడంతో పాటూ ముందు టైర్లు కూడా లేవు. బస్సు ముందు భాగాన్ని ట్రాక్టర్ ఇంజిన్‌కు జాయింట్ చేసి లాక్కెళ్తున్నారు.

Same Sex Marriage: మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.. కోర్టుకు వచ్చి మరీ బాంబు పేల్చిన ఇద్దరు యువతులు.. చివరకు..!

ట్రాక్టర్ వెనుక ట్రాలీ ఉండాల్సిన స్థానంలో బస్సును ఏర్పాటు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ బస్సు భలే ఉందే’’.., ‘‘ఇలాంటి బస్సును ఎప్పుడూ చూల్లేదు’’.., ‘‘ఐడియా అదిరిపోయింది బాసూ’’.., ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. ‘‘Incredible india’’., ‘‘బస్సుట్రాక్టర్ భలేగుంది’’.. అంటూ కొందరు కామెంట్ చేస్తుడగా, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 62వేలకు పైగా లైక్‍‌లను సొంతం చేసుకుంది.

Wife-Husband: లిప్ స్టిక్ తెచ్చిన తంటా.. ఇలాంటి భర్త నాకొద్దంటూ.. పెళ్లయిన మూడు నెలలకే షాకిచ్చిన భార్య.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..!

Updated Date - 2023-10-18T14:53:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising