ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Buying Vegetables: వారానికి సరిపడా కూరగాయలను ఒకేసారి కొంటున్నారా..? అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది..!

ABN, First Publish Date - 2023-11-29T12:13:59+05:30

కూరగాయలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ కూరగాయలను వారానికొకసారి కొంటే జరిగేదిదే..

కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. చాలామంది వారపు సంత చేస్తారు. బిజీ ఉద్యోగాలలో ఉండేవారు కూడా వీకాఫ్ రోజులలో మార్కెట్ కు వెళ్లి వారానికి సరిపడా కూరగాయలు కొంటుంటారు. కానీ ఇలా కూరగాయలు కొనడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిదనే విషయం చాలా మంది ఆలోచించరు. కూరగాయలను వారానికొకసారి అస్సలు కొనద్దని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇలా కొంటే ఏం జరుగుతుంది? దీని వెనుక కారణాలేంటి? తెలుసుకుంటే..

కూరగాయలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ కూరగాయలను వారానికొకసారి కొనకూడదు.

కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువరోజులు నిల్వ ఉండే బంగాళాదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి కూరగాయలు, తక్కువ కాలంలో పాడయ్యే బెండకాయ, ఆకుకూరలు, క్యాబేజీ వంటివి కూడా కొనుగోలు చేస్తారు. దీని వల్ల వారం ముగిసేసరికి కొన్ని ఆకుకూరలు, కూరగాయలు పాడైపోవడం లేదా వాడిపోవడం చాలా ఇళ్లలో జరుగుతుంది.

ఇది కూడా చదవండి: చలికాలంలో వచ్చే సమస్య ఇదే.. కాళ్లకు ఇలా పగుళ్లు వస్తే..!


వారానికి సరిపడా కూరగాయలు కొంటే ఓ నాలుగైదు రకాల కూరగాయలు అరకేజీ నుండి కేజీ వరకు తీసుకుంటారు. వాటిని ఒక్కోరోజు ఒక్కోటి వండుతారు. కానీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ 7రంగుల కూరగాయలు, పండ్లు అవసరం. అందుకే కొద్ది మొత్తంలో రోజూ లేదా రెండు రోజులకు ఒకసారి కూరగాయలు కొంటే శరీరానికి చక్కని పోషకాలు అందించగలం.

కూరగాయలను తాజాగా మార్కెట్ లో తెచ్చుకుంటే వాటిని రోజుల తరబడి ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం ఉండదు. గది ఉష్టోగ్రతలో ఉన్న కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి.

ఫ్రిజ్ లో కూరగాయలు తాజాగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ వాటిలో తేమ శాతం, పోషకాలు బలహీనమవుతాయి.

కూరగాయలను ఉదయం సాయంత్రం కొనుగోలు చేయడానికి వీలు లేకపోతే జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో కృత్రిమ లైట్ల వెలుతురులో చాలామంది రాత్రి సమయం కూరగాయలు కొంటూ మోసపోతారు.

క్యారెట్, టమోటా, బెండకాయలు, క్యాబేజీ వంటి కూరగాయలు తాజాగా ఉన్నట్టు కనిపించడానికి చాలా చోట్ల అదే రంగు లైట్లు అమరుస్తారు. అలాంటి చోట్ల కూరగాయలు కొంటుంటే జాగ్రత్తగా ఉండాలి.

ఇది కూడా చదవండి: Marriage Card: వధూవరులు ఇద్దరూ పీహెచ్‌డీలు చేస్తే ఇలాగే ఉంటుందేమో.. పెళ్లి కార్డును చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!


Updated Date - 2023-11-29T12:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising