ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: హ్యాండిల్ ముట్టుకోకుండానే.. సైకిల్‌పై వ్యక్తి అరుదైన రికార్డ్.. ఇంతకీ ఇతడు చేసిన ఫీట్ ఏంటంటే..

ABN, First Publish Date - 2023-12-08T19:29:07+05:30

బైకులు, సైకిళ్లపై కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తూ ఉంటాం. మరికొందరు అద్భుత విన్యాసాలు చేస్తూ రికార్డులు సృష్టిస్తుంటారు. ఇలాంటి విన్యాసాలలో కొన్నింటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఈ తరహా సాహసాలకు సంబంధించిన వార్తలు...

బైకులు, సైకిళ్లపై కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తూ ఉంటాం. మరికొందరు అద్భుత విన్యాసాలు చేస్తూ రికార్డులు సృష్టిస్తుంటారు. ఇలాంటి విన్యాసాలలో కొన్నింటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఈ తరహా సాహసాలకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి స్టంట్‌కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి హ్యాండిల్ ముట్టుకోకుండా సైకిల్‌పై అరుదైన ఫీట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. కెనడాకు చెందిన రాబర్ట్ ముర్రే అనే సైక్లిస్ట్ (Canadian Cyclist) .. అరుదైన రికార్డు సృష్టించాడు. సైకిల్ హ్యాండిల్ ముట్టుకోకుండా (Riding bicycle without touching the handle) 5:37 గంటల్లో 130.29 కిలోమీటర్లు రైడింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించాడు. ఈ ప్రయాణంలో అతను ఎక్కడా చేతులు ముట్టుకోకుండా కేవలం కాళ్లతో సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ వెళ్లాడు. దీనిపై ముర్రే మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం నిధులు సేకరించేందుకే తాను ఈ సాహసానికి పూనుకున్నట్లు తెలిపాడు.

Spy Apps: గూగుల్ డిలీట్ చేసిన 17 యాప్స్ లిస్ట్ ఇదీ.. మీ ఫోన్‌లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే డిలీట్ చేసేయండి..!

అల్జీమర్స్ వ్యాధితో తన బామ్మ మృతి చెందిందని, అప్పటి నుంచి వ్యాధిగ్రస్తులకు తన వంతు సాయంగా ఏదోటి చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. తనకు చిన్న తనం నుంచే సైకిల్ తొక్కడం అంటే ఇష్టమని తెలిపాడు. అప్పట్లో హ్యాండిల్ ముట్టుకోకుండా కనీసం 10 కిలోమీటర్లు తొక్కడం కూడా కష్టమయ్యేదని చెప్పాడు. అయితే రోజూ సాధన చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించడం సులభమైందని వివరించాడు. కాగా, ఈ వార్తకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! గ్రేట్ బ్రదర్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సాహసం చేయడం అందరికీ సాధ్యం కాదు’’.. అంటూ మరికొందరు, సైక్లిస్ట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాడో వ్యక్తి.. సడన్‌గా పరుగెత్తుకుంటూ వచ్చిన పులి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

Updated Date - 2023-12-08T19:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising