ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: హైదరాబాద్ వంటి సిటీల్లో ట్రాఫిక్ జామ్స్‌కు ఇలాంటి ఘటనలూ కారణమే.. ఓ డ్రైవర్ ఏం చేశాడో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-08-05T10:25:06+05:30

మనదేశంలోని మెట్రో నగరాల్లో రోడ్లపై ట్రాఫిక్ జామ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ జామ్‌లతో నగర వాసులు పడే నరకయాతన గురించి వివరించనక్కర్లేదు. అయితే చాలా సార్లు వాహనచోదకుల అతి తెలివే ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతుంది.

మనదేశంలోని మెట్రో నగరాల్లో రోడ్లపై ట్రాఫిక్ జామ్‌ (Traffic Jam)ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రాఫిక్ జామ్‌లతో నగర వాసులు పడే నరకయాతన గురించి వివరించనక్కర్లేదు. అయితే చాలా సార్లు వాహనచోదకుల అతి తెలివే ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతుంది. ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవడానికి రాంగ్ రూట్‌ (Wrong root)ను ఎంచుకుని మరింత గందరగోళానికి కారణమవుతారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

బెంగళూరు (Bengaluru)లోని ఘటనకు సంబంధించిన వీడియోను @mahitwietshere అనే ట్విటర్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కారు డ్రైవర్ (Car driver) రాంగ్ రూట్‌లో వెళ్లడానికి ప్రయత్నించాడు. కార్లన్నీ వరుసగా ఆగి ఉంటే, అతడు మాత్రం త్వరగా వెళ్లిపోవడానికి రాంగ్ రూట్‌ను ఎంచుకున్నాడు. అయితే ఆ మార్గంలో స్కూల్ బస్సు వస్తుండడంతో ఆ కారు డ్రైవర్ వెనక్కి రాక తప్పలేదు. ఆ ఘటన మొత్తం సోషల్ మీడియాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

Elephant Video: ఆ జీపులో ఎవరూ లేకున్నా.. భయపడి పారిపోయిన ఏనుగు..? ఎందుకలా చేసిందో మీరే చూడండి..!

వైరల్ అయిన ఆ వీడియో బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల (Bengaluru traffic police) దృష్టికి వెళ్లింది. దీంతో వారు రంగంలోకి దిగి ఆ కారు యజమానిని గుర్తించారు. ఆ వాహనాన్ని ట్రేస్ చేసి జరిమానా (Fine) విధించామని, కారు యజమాని ఆ జరిమానాను చెల్లించారని ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల వల్లే ట్రాఫిక్ జామ్‌లు పెరిగిపోతున్నాయని కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-05T10:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising