ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chicken Curry: చికెన్ కర్రీ తెచ్చిన తంటా.. మూడేళ్ల నుంచి సాగుతున్న కేసు.. చివరకు రూ.25 వేల జరిమానా.. అసలు కథేంటంటే..!

ABN, First Publish Date - 2023-09-21T22:01:03+05:30

చిన్న చిన్న తప్పులను కొందరు పెద్ద మనసుతో క్షమిస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటుంటారు. అవసరం అనుకుంటే కోర్టులకు వెళ్లడానికీ వెనుకాడరు. అయితే కొన్నిసార్లు ఇలాంటి కేసులు ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో పడిపోతుంటాయి. అయినా..

ప్రతీకాత్మక చిత్రం

చిన్న చిన్న తప్పులను కొందరు పెద్ద మనసుతో క్షమిస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటుంటారు. అవసరం అనుకుంటే కోర్టులకు వెళ్లడానికీ వెనుకాడరు. అయితే కొన్నిసార్లు ఇలాంటి కేసులు ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో పడిపోతుంటాయి. అయినా చివరకు బాధితులకు సరైన న్యాయమే జరుగుతుంటుంది. తాజాగా, చండీగఢ్‌లో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. రెస్టారెంట్‌లో చికెన్ తింటున్న మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. మూడేళ్ల పాటు సాగిన ఈ కేసులో చివరకు హోటట్ యాజమాన్యానికి రూ.25వేల జరిమానా పడింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

చండీగఢ్‌లోని (Chandigarh) ఓ రెస్టారెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన రంజోత్ కౌర్ అనే మహిళ.. 2020 సెప్టెంబర్ 14న నగరంలోని చిల్లీస్ రెస్టారెంట్‌కు వెళ్లింది. చికెన్ కర్రీ ఆర్డర్ చేసిన ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. కూర తినే క్రమంలో అందులో బతికున్న (Live worm in chicken curry) పురుగును చూసి ఖంగుతింది. దీంతో వెంటనే హోటల్ మేనేజర్ వద్దకు వెళ్లి విషయం తెలియజేసింది. దీంతో అవాక్కయిన అతను ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా వినిపించుకోని మహిళ చికెన్ కూరలోని పురుగును వీడియో తీసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెకు, హోటల్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. ఆధారాలు లేకుండా చేసేందుకు సిబ్బంది కూరును తీసుకెళ్లి పక్కన పడేశారు.

Woman: 6 నెలల బాబును ఒడిలో వేసుకుని అడుక్కుంటున్న మహిళ ప్రవర్తనపై స్థానికులకు డౌట్.. పోలీసుల ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్..!

అయినా ఈ విషయాన్ని అంటితో వదలని మహిళ.. చివరకు రెస్టారెంట్‌కు లీగల్ నోటీసు పంపింది. చివరకు ఈ కేసు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వరకూ వెళ్లింది. సదరు మహిళ తమ రెస్టారెంట్‌కు ఉన్న మంచి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంతో కావాలనే ఇలా చేసిందంటూ హోటల్ యాజమాన్యం చెప్పుకొచ్చింది. ఈ కేసుపై మూడేళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా, జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ (consumer disputes redressal commission) .. ఈ కేసుపై ఆదేశాలు జారీ చేసింది. ఆహారంలో పురుగులు ప్రత్యక్షమవడం హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా పేర్కొంటూ.. సదరు రూ.25,000 జరిమానా విధించింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు.. సదరు మహిళను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Wife: మూడేళ్ల క్రితం నాటి సినిమా స్టోరీ.. రియల్‌లైఫ్‌లో రిపీట్.. అందరి ముందు భర్త తనను నవ్వులపాలు చేశాడని ఓ భార్య నిర్ణయమిదీ..!

Updated Date - 2023-09-21T22:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising