అర్ధరాత్రి షాకింగ్ ఘటన.. నడి రోడ్డుపై ఏడు మందిని అత్యంత కిరాతకంగా.. వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
ABN, First Publish Date - 2023-01-10T16:32:04+05:30
దొంగల గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్ధరాత్రి ఓ వర్గం వారు మరో వర్గం వారిపై దాడికి దిగారు. అత్యంత కిరాతంగా వారు చేసిన హత్యలతో తీవ్ర ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఛత్తీస్‌గఢ్‌లో..
దొంగల గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్ధరాత్రి ఓ వర్గం వారు మరో వర్గం వారిపై దాడికి దిగారు. అత్యంత కిరాతంగా వారు చేసిన హత్యలతో తీవ్ర ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివారాల్లోకి వెళితే..
Viral Video: చీర కట్టుకుని.. రోటీన్‌కు భిన్నంగా మహిళ చేసిన కసరత్తులు.. మామూలుగా లేవు..
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) దుర్గ్ జిల్లా పరిధి పాత భిలాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్‌ఖోజ్ పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు వరస చోరీలకు పాల్పడుతున్నారు. వీరిలో సూరజ్, రాహుల్ అనే రెండు గ్రూపులు ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా రెండు గ్రూపుల మధ్య గొడవలు (quarrels) జరుగుతున్నాయి. సూరజ్ గ్రూపులోని కొందరు పోలీసులకు చెప్పడంతో రాహుల్ గ్రూపు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో రాహుల్ బృందం ఇటీవల ఓ రోజు ఖుర్సీపర్‌కు చెందిన 20 మందిని పిలిపించారు.
హనీమూన్‌లో అర్ధరాత్రి నిద్ర లేచిన భర్త.. భార్య ఏం చేస్తోందో చూద్దామని వెతగ్గా.. ఎదురుగా..
సోమవారం అర్ధరాత్రి మొత్తం 21మంది వ్యక్తులు గొడ్డళ్లు, కర్రలతో సూరజ్ గ్రూపు సభ్యులపై దాడికి దిగారు. మొత్తం ఏడు మందిని దారుణంగా హతమార్చారు. సూరజ్ గ్రూపులోని ఓ వ్యక్తిని కిందపడేసి.. కర్రలు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే అతను మృతి చెందినా శాంతించని దుండగులు.. పెద్ద రాయితో కొట్టి, తలను నుజ్జునుజ్జు చేశారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీ ఫుటేజీ (CCTV footage) ఆధారంగా నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న 21మందిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
Viral Video: ఇతడి తెలివిని చూసి ఆనంద్ మహీంద్రాయే అవాక్కయ్యారు.. రూపాయి ఖర్చు లేకుండా..
Updated Date - 2023-01-10T16:32:10+05:30 IST