ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vande Bharat: వందే భారత్‌ ట్రైన్‌లో షాకింగ్ ఘటన.. చపాతీ ఆర్డర్ ఇచ్చిన ప్రయాణికుడికి వింత అనుభవం.. క్షమాపణలు చెప్పిన రైల్వేశాఖ

ABN, First Publish Date - 2023-07-28T14:04:30+05:30

వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.

Vande Bharat: వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ట్రైన్‌లో (Train) అతడు ఆర్డర్ ఇచ్చిన చపాతీలో బొద్దింక (Cockroach) కనిపించడంతో షాకయ్యాడు. అనంతరం బొద్దింక ఉన్న చపాతీ ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా రైల్వేశాఖకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పింది. అసలేం జరిగిందంటే.. జులై 24న భోపాల్ నుంచి గ్వాలియర్ వెళుతున్న వందేభారత్‌ ట్రైన్‌లో సుబోధ్ పహలాజన్ ప్రయాణించాడు. మధ్యలో ఆకలి వేయడంతో చపాతీలు ఆర్డర్ ఇచ్చాడు. కొంతసేపటి తర్వాత అతని చేతికి ఆహారం పార్శిల్ వచ్చింది.

దాంతో సుబోధ్ ఆ ఆహారం పార్శిల్‌‌ను ఓపెన్ చేసి చూస్తే.. ఓ చపాతీపై చిన్న బొద్దింక కనిపించింది. వెంటనే దాన్ని ఫొటో తీసి నెట్టింట షేర్ చేస్తూ ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేశాడు. 'వందే భారత్ రైల్లో నాకు ఇచ్చిన ఆహారంలో బొద్దింక కనిపించింది' అంటూ సుబోధ్ ట్వీట్ చేశాడు. ఇక సుబోధ్ ట్వీట్ వైరల్‌గా మారడంతో రైల్వేశాఖ వెంటనే స్పందించింది. అతడికి క్షమాపణలు చెప్పిన ఐఆర్‌సీటీసీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే ఆహార సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌‌కు ఐఆర్‌సీటీసీ రూ. 25 వేలు జరిమానా కూడా విధించింది.

Kerala Lottery: జస్ట్ రూ.250 లాటరీ టికెట్‌కు.. రూ.10 కోట్ల జాక్‌పాట్..!


Updated Date - 2023-07-28T14:04:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising