RTC Bus: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ జర్నీ.. చేతిలో పెళ్లి ఆల్బమ్‌కు కూడా టికెట్ వేసిన కండక్టర్.. చివరకు ఓ ఐఏఎస్ అధికారే..!
ABN, First Publish Date - 2023-09-09T18:14:04+05:30
ఆర్టీసీలో బస్సులో ప్రయాణం సురక్షితమంటూ అధికారులు పదే పదే ప్రచారం చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ప్రైవేట్ బస్సులతో పోల్చి చూస్తే.. ఆర్టీసీ ప్రయాణం మేలని భావించి చాలా మంది ఈ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు..
ఆర్టీసీలో బస్సులో ప్రయాణం సురక్షితమంటూ అధికారులు పదే పదే ప్రచారం చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ప్రైవేట్ బస్సులతో పోల్చి చూస్తే.. ఆర్టీసీ ప్రయాణం మేలని భావించి చాలా మంది ఈ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళ చేతిలోని పెళ్లి ఆల్బమ్‌కు కూడా టికెట్ కొట్టాడు కండర్లర్. చివరకు ఈ ఘటపై ఐఏఎస్ అధికారే స్పందించాల్సి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ బస్సులో (RTC bus) షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె తన వివాహ ఆల్బమ్ (wedding album) పట్టుకుని సోలన్ నుంచి ఢిల్లీ వెళ్లే బస్సు (Solan to Delhi bus) ఎక్కింది. అయితే బస్సు ఎక్కిన కాసేపటికి కండెక్టర్ ఆమె వద్దకు వచ్చి టికెట్ కొట్టాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. టికెట్ కొట్టిన తర్వాత, ఆమె చేతిలో ఉన్న పెళ్లి ఆల్బమ్‌కూ టికెట్ కొట్టాడు. లగేజీ చార్జి (Baggage charge) కింద రూ.207లు టికెట్ ఇచ్చాడు. దీంతో షాకైన మహిళ.. బస్ టికెట్‌ను ఫొటో తీసి, తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ఈ ఫొటో వైరల్ అవడంతో (Viral photo) హిమాచల్ ఆర్టీసీ ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. చివరకు ఈ ఘటనపై హెచ్ఆర్టీసీ, ఐఏఎస్ అధికారి స్పందించారు. ‘‘ఆల్బమ్‌కు లగేజీ చార్జ్ చేసిన మాట వాస్తవమే అని, ఇది మా పాలసీ మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధం. ప్రయాణికుడికి డబ్బు వాపస్ చేయబడుతుంది. జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’’.. అంటూ ఐఏఎస్ అధికారి బదులిచ్చారు. ఈ ఘటనపై బాధ్యుల నుంచి వివరణ కోరారు. కాగా, ఫొటోలకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కండెక్టర్ చాలా వెరైటీగా ఉన్నట్టున్నాడే’’.. అని కొందరు, ‘‘పెళ్లి ఫొటోలకూ లగేజీ టికెటా.. ఎక్కడా చూడలేదే’’.. అని మరికొందరు ‘‘ఇంకా నయం.. వాటర్ బాటిల్, చెప్పులు, ఒంటి మీద డ్రస్సుకూ చార్జి వేయలేదు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-09-09T18:14:04+05:30 IST