ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రోడ్డు మధ్యలో ఉన్నట్టుండి కారు ఆపిన భర్త.. కొడుకుతో పాటూ భార్యను కింద లాగి మరీ.. అతడు చేసిన నిర్వాకం...

ABN, Publish Date - Dec 19 , 2023 | 04:54 PM

దంపతుల మధ్య నిత్యం ఎన్నో రకాల సమస్యలు తలెత్తుంటాయి. అయితే అవి ఎక్కువగా నాలుగు గోడల వరకే పరిమితం అవుతుంటాయి. అయితే దంపతులు మాత్రం ఏమాత్రం విచక్షణా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే..

దంపతుల మధ్య నిత్యం ఎన్నో రకాల సమస్యలు తలెత్తుంటాయి. అయితే అవి ఎక్కువగా నాలుగు గోడల వరకే పరిమితం అవుతుంటాయి. అయితే దంపతులు మాత్రం ఏమాత్రం విచక్షణా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే వారి భార్యల పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డు మధ్యలో ఉన్నట్టుండి కారు ఆపిన భర్త.. కొడుకుతో పాటూ భార్యను కిందకు లాగిపడేశాడు. నడి రోడ్డుపై ఏడుస్తున్నా పట్టించుకోకుండా అతడి ప్రవర్తించిన తీరు చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Vide) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్య, కొడుకును తీసుకుని కారులో వెళ్తుంటాడు. అయితే మార్గ మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఉన్నట్టుండి అతను కారును నిలిపేశాడు. కిందకు దిగి వచ్చి వెనుక కూర్చున్న భార్యను డోరు తీసి, బలవంతంగా బయటికి లాగేశాడు. దీంతో కొడుకుని ఎత్తుకుని ఉన్న ఆమె.. ధబేల్‌మని రోడ్డుపై పడిపోయింది. వారిని కింద పడేసిన తర్వాత కారు తీసుకుని వెళ్లిపోవాలని ప్రయత్నిస్తాడు. అయితే భార్య మాత్రం వెంటనే పైకి లేచి, కారులో ముందు వైపు లోపల కూర్చుని భర్తను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటుంది.

Viral Video: మీకు టామాటా సాస్ అంటే ఎంతో ఇష్టమా.. అయితే ఈ వీడియో చూస్తే.. మీ అభిరుచిని వెంటనే మార్చుకుంటారు..

మరోవైపు రోడ్డుపై ఉన్న పిల్లాడు.. గుక్కపట్టి ఏడుస్తూ అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. వీరి గొడవను గమనించిన వాహనదారులు ఆశ్చర్యంగా చూస్తుండిపోతారు. వారిలో ఓ వ్యక్తి దగ్గరికి వెళ్లి పిల్లాడిని ఎత్తుకుని ఓదారుస్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడు అసలు మనిషేనా’’.. అంటూ కొందరు, ‘‘పిల్లాడిని కూడా పట్టించుకోకుండా ఇలా చేయడం దారుణం’’ అంటూ ఇంకొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Crime News: ఇంటి ముందు మూత్రవిసర్జన చేసిందనే కోపంతో.. మహిళ అని చూడకుండా.. ప్రైవేట్ భాగాలపై..

Updated Date - Dec 19 , 2023 | 04:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising