ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cow Milk vs Buffalo Milk: ఆవు పాలు మంచివా..? గేదె పాలు మంచివా..? ఆరోగ్యానికి ఏది మంచిదో అసలు నిజాలివీ..!

ABN, First Publish Date - 2023-08-10T15:27:52+05:30

పాలు ఎముకల అభివృద్దికి, ఎముకలు బలంగా ఉండటానికి కండరాల పెరుగుదలకు, శరీర వ్యవస్థకంతటికీ గొప్పగా సహాయపడతాయి. అందుకే పిల్లలు, పెద్దలు, మహిళలు, గర్భవతులు ఇలా అందరూ పాలు తప్పనిసరిగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతారు. కానీ ఏ పాలు మంచివంటే..

పాలు మంచి పోషకాహారం. తల్లిపాల తరువాత పిల్లలకు కడుపు నింపేవి పాలే. పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే ప్రోటీన్, విటమిన్-డి, విటమిన్ బి12 వంటి పోషకాలు కూడా ఉంటాయి. పాలు ఎముకల అభివృద్దికి, ఎముకలు బలంగా ఉండటానికి కండరాల పెరుగుదలకు, శరీర వ్యవస్థకంతటికీ గొప్పగా సహాయపడతాయి. అందుకే పిల్లలు, పెద్దలు, మహిళలు, గర్భవతులు ఇలా అందరూ పాలు తప్పనిసరిగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతారు. ఆవు పాలు శ్రేష్టమని ఎంతోమంది చెబుతున్నా వీటి గురించి ఫిర్యాదులు చేసేవారు ఉన్నారు. మరొకవైపు గేదె పాలు ఆరోగ్యానికి మంచిదని వాదించేవారు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అసలు ఏ పాలు ఆరోగ్యానికి మంచివి? ఆవు పాలా? గేదె పాలా? పూర్తీగా తెలుసుకుంటే..

పోషకాల పరంగా చూస్తే గేదెపాల కంటే ఆవుపాలు ఆరోగ్యకరమైనవి. ఆవుపాలలో ప్రోటీన్(protein), కొవ్వు(fats), కార్భోహైడ్రేట్లు సమాన నిష్పత్తిలో ఉంటాయి. గేదె పాలకంటే ఆవు పాలలో కొవ్వులు తక్కువ. కొలెస్ట్రాల్ గురించి ఆందోళన చెందేవారు ఆవు పాలను నిరభ్యరంతంగా తీసుకోవచ్చు. గేదెపాలతో పోలిస్తే ఆవుపాలు చాలా తొందరగా జీర్ణమవుతాయి. ఆవుపాలలో ఉండే కొవ్వు పరిమాణం తక్కువ. ఈ కొవ్వు జీర్ణక్రియకు సహాయపడుతుంది. అదే గేదెపాలలో ఈ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. లాక్టోస్ సైడ్ ఎఫెక్ట్ ఉన్నవారు గేదెపాలు జీర్ణించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

R Thyagarajan: ఎవరీ పెద్దాయన..? రూ.6200 కోట్లను దానం చేసేసి.. ఓ చిన్న ఇంట్లో మకాం..!



విటమిన్-ఎ(vitamin-A) ను పాల నుండి పొందాలని అనుకునేవారికి ఆవుపాలు బెస్ట్ ఆప్షన్. ఆవుపాలలో గేదెపాల కంటే ఎక్కువ విటమిన్-ఎ ఉంటుంది. విటమిన్-ఎ రోగనిరోధక వ్యవస్థకు, కంటిచూపుకు, ఎముకలకు కూడా మంచిది. కాబట్టి ఆవుపాలు తీసుకుంటే విటమిన్-ఎ బాగా అందుతుంది. గేదెపాలతో పోలిస్తే ఆవుపాలలో కేలరీల కంటెంట్ తక్కువగా ఉంటుంది. బరువు పెరుగుతామేమో అని భయపడేవారు ఆవు పాలు ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు.

ధర పరంగా చూస్తే ఆవు పాలు గేదె పాలకంటే తక్కువ ధరలో లభిస్తాయి. చాలాచోట్ల గేదె పాలు అంతగా అందుబాటులో కూడా ఉండవు. కానీ ఆవు పాలు మాత్రం అన్నిచోట్లా అందుబాటులో ఉంటాయి. గేదెపాలతో పోలిస్తే ఆవుపాలలో అలెర్జీ కలిగించే గుణం తక్కువ. ఆవుపాలను, గేదెపాలను కంపేర్ చేసి చూసినప్పుడు గేదెపాలలో ప్రోటీన్ ఎక్కువ. కానీ ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఆవుపాలే మంచివని పోషకాహారనిపుణులు చెబుతున్నారు. ఆవుపాలు తాగాలా? గేదెపాలు తాగాలా? అనేది ప్రతి వ్యక్తి వారి శరీరానికి అవసరమైన పోషకాలు, ప్రోటీన్ ను బట్టి నిర్ణయించుకోవాలి.

Health Tips: అమ్మ బాబోయ్.. ఒకే ఒక్క లవంగం వల్ల ఇన్ని అద్భుతాలు జరుగుతాయా..? రోజూ పరగడుపున ఓ లవంగాన్ని తింటూ ఉంటే..


Updated Date - 2023-08-10T15:27:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising