Cow Video: బోరుబావిలో ఓ ఆవు పడటాన్ని ఎప్పుడైనా చూశారా..? ఎలా బయటకు తీశారో చూస్తే..!
ABN, First Publish Date - 2023-09-13T13:41:04+05:30
బోరుబావులో పిల్లలు పడటం గురించి విని ఉంటాం. కానీ ఏకంగా భారీగా ఉన్న ఆవు బోరుబావి రంధ్రంలో పడింది. రైతులు మాత్రం కష్టంపడకుండానే ఎంత ఈజీగా తీశారో..
బోరు బావులు పిల్లలపాలిట యమపాశాలు. దేశంలో ఎన్నో చోట్ల చిన్నారుల విషయంలో జరిగిన సంఘటనలు ఈ మాటకు బలం చేకూరుస్తాయి. పిల్లలు ఆడుకుంటూ ఇంటి బయట, రహదారుల ప్రక్కన బోరుబావికోసం చేసిన రంధ్రాలలో పడిపోతుంటారు. బోరుబావి రంధ్రాలలో పడి ప్రాణాలతో బయటపడిన పిల్లలు బహుశా అరుదనే చెప్పవచ్చు. కానీ బోరుబావిలో ఏకంగా ఆవు పడటం ఎప్పుడైనా చూశారా? ఈ ఆవును బయటకు తీయడానికి రైతులు చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
పిల్లలు ఆడుతూ పాడుతూ స్థానికంగా బోరు కోసం వేసిన రంధ్రాలలో పడుతుంటారు. వీరిని బయటకు తీయడానికి బోరుబావి రంధ్రాలకు ఒకవైపు క్రేన్ ల సహాయంతో మట్టిని తవ్వుతూ పిల్లలు పడిన ప్రాంతానికి చేరుకుని వారిని బయటకు తీస్తుంటారు. కానీ విచిత్రంగా ఓ ఆవు(cow) బోరుబావిలో పడింది. యుకే(UK) లోని డుర్హమ్(Durham) నగరంలో ఉన్న విట్టన్ కాస్టెల్ కంట్రీ పార్క్(Witton castle country park) లో ఆవుల పెంపకం, పాడి పరిశ్రమ సాగుతోంది. ఇక్కడున్న ఆవులన్నీ ఆ ఫార్మ్ లో తిరుగుతుండగా ఒకచోటు బోరుబావి కోసం వేసిన పెద్ద రంధ్రం దగ్గర ఆవు ఆడుగు వేసింది. అది ఆ రంధ్రం నుండి తప్పించుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అది నిలువునా ఆ రంధ్రంలో పడిపోయింది. ఆవు బోరుబావిలో పడిపోగానే(cow fell in borewell hole) మిగిలిన ఆవులన్నీ పెద్ద పెట్టున అరుస్తూ తమ యజమానులను అప్రమత్తం చేశాయి. అక్కడి రైతులు వెంటనే అలర్ట్ అయ్యారు. బోరుబావిలో పడిన ఆవు కాళ్లకు తాళ్లు బిగించి, ఆ తాడులు అన్ని ఒకటిగా ముడి వేశారు. దాన్ని క్రేన్ పై భాగాన కట్టి క్రేన్ సహాయంతో ఆవును మెల్లిగా పైకి తీశారు. మొదట ఆవును పైకి తీస్తుంటే అది కదలదు, మెదలదు. అంత పెద్ద జంతువు ఆ రంధ్రంలో పడి ప్రాణాలు కోల్పోయిందేమో అనిపిస్తుంది. కానీ ఆ ఆవును పూర్తీగా బయటకు తీసి నేలమీద పడుకోబెట్టి దాని కాళ్ళకున్న తాడులు విప్పగానే అది ఉన్నట్టుండి కదులుతుంది. ఆ తరువాత మెల్లగా పైకి లేచి కాస్త ముందుకు వెళుతుంది. బోరుబావిలో పడిపోయిన తమ ఫ్రెండు ఎప్పుడు బయటకు వచ్చి తమతో కలుస్తుందా అని అప్పటివరకు వెయిట్ చేసిన మిగిలిన ఆవులు, ఈ ఆవును చూడగానే చాలా సంతోషించాయి. ప్రమాదం నుండి బయటపడిన ఆవు దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా తలలతో దాని శరీరాన్ని రాస్తూ తమ ప్రేమను వ్యక్తం చేశాయి.
Health Tips: ఎండ లేకపోయినా సరే.. విటమిన్ డి ని పొందవచ్చు.. అందుకోసం ఇలా చేయండి..
ఈ వీడియోను Farmers Weekly అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆవు తిరిగి నడవడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'ఆ రైతులు నిజంగా దేవుళ్ళు, వారు వెంటనే అలర్ట్ కాకపోతే ఆ ఆవు ప్రాణాలతో బయటపడేది కాదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆ ఆవు ప్రాణాలతో బయట పడగానే దాని స్నేహితులలో కనిపించిన ఆరాటం నిజంగా మనసును హత్తుకునేలా ఉంది' అని మరొకరు కామెంట్ చేశారు.
Health Tips: రాత్రి పూట స్నానం చేసే అలవాటుందా? అయితే ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..
Updated Date - 2023-09-13T13:41:04+05:30 IST