ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cow Viral Video: మతం పేరుతో కొట్టుకు చచ్చేవాళ్లకు ఈ వీడియో ఓ గుణపాఠం.. అంతా కలిసి ఓ ఆవును ఎలా కాపాడారంటే..!

ABN, First Publish Date - 2023-07-22T16:21:31+05:30

మానవత్వానికి మతం లేదు. కష్టాల్లో ఉన్న వారిని అదుకోవడానికి కావాల్సింది మతం కాదు.. మానవత్వం. ఏ మతం వారైనా సరే, వారిలో మానవత్వం ఉంటే ఎదుటి వారి కష్టానికి చలించిపోతారు. వారిని కాపాడేందుకు ముందుకు వస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో మతం పేరుతో కొట్టుకు చచ్చే వాళ్ల కళ్లు తెరిపిస్తోంది.

మానవత్వానికి (Humanity) మతం లేదు. కష్టాల్లో ఉన్న వారిని అదుకోవడానికి కావాల్సింది మతం (Religion) కాదు.. మానవత్వం. ఏ మతం వారైనా సరే, వారిలో మానవత్వం ఉంటే ఎదుటి వారి కష్టానికి చలించిపోతారు. వారిని కాపాడేందుకు ముందుకు వస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) మతం పేరుతో కొట్టుకు చచ్చే వాళ్ల కళ్లు తెరిపిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. giedde అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Cow Viral Video).

వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఒక ఆవు (Cow) వేగంగా నీరు ప్రవహిస్తున్న ఓ వాగులో కొట్టుకుపోతుండగా ఇద్దరు వ్యక్తులు దానిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఆవు కొమ్ములు పట్టుకుని ఒడ్డుకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దానిని రక్షేందుకు వారికి బలం సరిపోలేదు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ ఘటనను చూసి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. నలుగురూ కలిసి ఆ ఆవును సురక్షితంగా బయటకు లాగారు. అలా ఆవును బయటకు లాగిన వారిలో ముస్లిం మతానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆవులకు, ముస్లింలకు సంబంధించి పలు వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.

Viral: ఈ ఫొటోలోని వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా..? పెళ్లయిన కొత్తలో భార్య తీసిన ఫొటోను బయటపెట్టిన ఈ సెలబ్రెటీ ఎవరంటే..!


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలను లక్షల మంది వీక్షించారు. 21 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇది అందమైన, అద్భుతమైన వీడియో``, ``మానవత్వానికి మతం లేదు``, ``మతం కాదు.. మానవత్వమే గొప్పది``, ``ఈ వీడియో నా రోజును గొప్పగా మార్చింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-22T16:21:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising