ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా.. మనిషిని ఎత్తుకుని డాన్స్ చేయడం చూశాం గానీ.. మరీ ఇలా ఏకంగా..

ABN, First Publish Date - 2023-04-27T18:18:27+05:30

పెళ్లిళ్ల సమయాల్లో ఏ కార్యక్రమాలు లేకున్నా.. డాన్స్ కార్యక్రమాలు మాత్రం విధిగా ఉండేలా చూసుకుంటుంటారు. డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. కొన్నిసార్లు వధూవరులు కూడా అందరితో పాటూ డాన్సులు వేస్తుండడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లిళ్ల సమయాల్లో ఏ కార్యక్రమాలు లేకున్నా.. డాన్స్ కార్యక్రమాలు మాత్రం విధిగా ఉండేలా చూసుకుంటుంటారు. డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. కొన్నిసార్లు వధూవరులు కూడా అందరితో పాటూ డాన్సులు వేస్తుండడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు యువకులు.. లైకులు, వ్యూస్ కోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వివహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో డీజే పాటలకు యువకులు వేసిన డాన్స్ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral Videos) అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో యువతీయువకులంతా డీజే పాటలకు (DJ songs) డాన్సులు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు వరుడిని (groom) భుజాల పైకి ఎక్కించుకుని డాన్స్ (Dance) వేస్తుంటారు. అదే సమయంలో ఓ యువకుడు బైకుపై అటుగా వస్తాడు. దీంతో అక్కడున్న యువకులంతా ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోతారు. అంతులోని అత్యుత్సాహంతో యువడితో పాటూ బైకును (bike) కూడా పైకి ఎత్తుకుంటారు.

Viral Vdeo: మిరాకిల్ అంటే ఇదేనేమో.. అంతెత్తు నుంచి పడిపోయిన చిన్నారి.. ఆ వెంటనే ఏం చేసిందంటే..

అంతటితో ఆగకుండా రౌండ్లు, రౌండ్లు తిప్పి మరీ డాన్సు వేస్తారు. ఇదేదో బాగుందే... అనుకుంటూ బైకుపై ఉన్న యువకుడు మరింత రెచ్చిపోయి డాన్స్ వేస్తాడు. ఇలా అతన్ని చాలా సేపు గాల్లోనే ఎగరేస్తూ డాన్సులు వేస్తారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారంతా వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే! ఈ డాన్సేదో కొత్తగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘వీరి పిచ్చి పీక్స్‌కు వెళ్లింది బాబోయ్’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral News: ఈ వ్యభిచారాన్ని వదిలెయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా.. హోటల్‌లో కలిసిన 20 ఏళ్ల వేశ్యకు ఓ కుర్రాడి ఆఫర్.. చివరకు..!

Updated Date - 2023-04-28T21:03:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising