ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. ఫోన్లో మాట్లాడుతూనే ఏకంగా రూ.లక్ష కొట్టేసిన కేటుగాళ్లు.. అసలేం చేశారంటే..!

ABN, First Publish Date - 2023-09-21T15:56:03+05:30

ఇన్నాళ్ళు జరుగుతున్న సైబర్ నేరాలకు విభిన్నంగా ఓ మహిళ సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయింది. ఫోన్లో మాట్లాడుతుండగానే సదరు సైబర్ నేరగాళ్లు ఆమె బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు స్వాహా చేశారు.

ప్రస్తుతకాలంలో ప్రజలు ఎక్కువగా మోసపోతున్నది సైబర్ నేరగాళ్ల చేతుల్లోనే. సాధారణ మెసేజ్లను పోలిన మెసేజులు పంపడం, ఖరీదైన వస్తువులు ఆఫర్ ఉన్నాయంటూ లింక్ లు పంపడం చేస్తారు. పొరపాటున వాటిని ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు. ఆ మెసేజ్ ఓపెన్ చేసిన వారి బ్యాంకు ఖాతాలు నిమిషాలలో ఖాళీ చేస్తారు. అయితే వీటికి విభిన్నంగా ఓ మహిళ సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయింది. ఫోన్లో మాట్లాడుతూనే సదరు సైబర్ నేరగాళ్లు ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బు స్వాహా చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రంలో సైబర్ నేరానికి సంబంధించి ఓ కొత్త సంఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాష్ట్రం పుణె జిల్లాలో బలెవాడి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు విద్యుత్ శాఖ అధికారి(Electricity officer) పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. నిందితుడు తనను తాను మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో అధికారిగా పరిచయడం చేసుకున్నాడు. ఆ తరువాత విద్యుత్ బిల్లు(Electricity bill) గడువు ముగిసినా సరే ఇంకా చెల్లించలేదని, విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఫోన్ లో మహిళను బెదిరించాడు. అతను చాలా కాన్ఫిడెంట్ గా అలా మాట్లాడటంతో ఆ మహిళ నిజమేననుకుని చాలా భయపడిపోయింది. ఆమె భయపడుతోందని గ్రహించి ఆమెతో 'మీరు వెంటనే మీ మొబైల్ లో 'టెకీ సపోర్ట్'(tech support) అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో నుండి విద్యుత్ బిల్లు ఇప్పటికిప్పుడే చెల్లించవచ్చు' అని నమ్మబలికాడు. ఆ మహిళ నిందితుడు చెప్పినట్టే చేయడంతో ఆమె బ్యాంక్ ఖాతా సమాచారాన్ని యాక్సెస్ చేశాడు. ఆ సమాచారాన్ని సద్వినియోగం చేసుకుని ఆన్ లైన్ లావాదేవీల ద్వారా మహిళ బ్యాంక్ ఖాతా నుండి లక్షరూపాయలు డ్రా చేశాడు.

Viral Video: అమ్మ బాబోయ్.. సినిమాల్లోనే ఇలాంటి సీన్లు చూసుంటారు.. జింకపై ఓ చిరుత ఎలా అటాక్ చేసిందో చూస్తే..!


ఈ సంఘటన జరిగిన తరువాత సదరు మహిళ మొబైల్ కు లక్షరూపాయలు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. అది చూసుకున్న మహిళ తాను మోసపోయనట్టు గ్రహించింది. తనకు ఫోన్ చేసింది విద్యుత్ అధికారులు కాదని, సైబర్ నేరగాళ్లని అర్థమయ్యాక ఆమె వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసును ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: ఇలాంటి ప్రేయసి దక్కినందుకు అతడు నిజంగా అదృష్టవంతుడంటూ.. నెటిజన్ల ప్రశంసలకు కారణమేంటంటే..!


Updated Date - 2023-09-21T15:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising