ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Traffic challans: ఎంత దారుణం.. చలానాలు భరించలేక ప్రాణాలు తీసుకున్న నిరుపేద.. కేసీఆర్‌కు ఒక విజ్ఞప్తి!

ABN, First Publish Date - 2023-03-09T16:40:18+05:30

ట్రాఫిక్‌ చలానాలు రూ.10 వేలు కట్టలేక, ట్రాఫిక్‌ ఎస్‌ఐ టార్చర్‌ భరించలేక నిరుపేద కూలీ ఎల్లయ్య ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ‘ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్‌ సమస్యల (Traffic rules) పరిష్కారానికి కృషి చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించే వారికి చలాన్లు విధిస్తాం’ స్పెషల్‌ డ్రైవ్‌ల సమయంలో ట్రాఫిక్‌ ఉన్నతాధికారుల ప్రకటలు ఇవి. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనడానికి ట్రాఫిక్‌ చలానాలు (Traffic challans) రూ.10 వేలు కట్టలేక, ట్రాఫిక్‌ ఎస్‌ఐ టార్చర్‌ భరించలేక ఆత్మహత్య చేసుకున్న కూలీ ఎల్లయ్య (A Yellaiah ends life) ఘటనే ఇందుకు నిదర్శనం. నగరం ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుని వాహనదారులు నరకయాతన పడుతున్నా, పట్టించుకోవాల్సిన విభాగం చలానా వసూళ్లపైనే దృష్టి సారించింది. ట్రాఫిక్‌ సిబ్బందికి (Traffic staff) ఉన్నతాధికారులు టార్గెట్‌లు నిర్దేశించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిబ్బంది ట్రాఫిక్‌ను గాలికొదిలేసి చలాన్ల విధింపు, వసూళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని వాహనదారులు విమర్శిస్తున్నారు.

ఎల్లయ్య ఆత్మహత్యతో..

బైక్‌పై ఉన్న పెండింగ్‌ చలానాలు (Pending challans) వెంటనే చెల్లించాలంటూ ట్రాఫిక్‌ ఎస్‌ఐ దూషించడం, వేధించడంతో అవమానానికి గురై నిరుపేద కూలీ ఎల్లయ్య ఆత్మహత్య చేసుకోవడం హైదరాబాద్ (Hyderabad) సంచలనం సృష్టించింది. హమాలీ కూలీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఎల్లయ్య బైక్‌పై (Bike challans) రూ.10 వేల వరకు పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. బైక్‌ను ఆపిన మీర్‌చౌక్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ గణేష్‌ పెండింగ్‌ చలానాలు చెల్లించేంత వరకు బైక్‌ ఇచ్చేది లేదని జప్తు చేశాడు. రెక్కాడితే డొక్కాడని ఎల్లయ్య బైక్‌ కోసం ఎస్‌ఐని ప్రాధేయపడ్డాడు. కనకరించకపోగా ఎస్‌ఐ దుషించాడు. ఎల్లయ్య సూసైడ్‌ నోట్‌లో ఇదంతా రాశాడు. చలానాల వసూలు పేరుతో వాహనదారులను (Bikers) పోలీసులు వేధించకుండా (Police Harrasement), వారి ప్రాణాలు పోకుండా కేటీఆర్‌ (KTR), కేసీఆర్‌ (KCR) చర్యలు తీసుకోవాలని కోరాడు. ఆ సూసైడ్‌ నోట్‌ పరిశీలిస్తే చలానాల వసూలు పేరుతో ట్రాఫిక్‌ పోలీసులు చేస్తున్న అరాచకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పదిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలో ఓ వాహనదారుడిని ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఇష్టానుసారంగా దూషించడంతో అవమానంగా భావించిన వాహనదారుడు కరెంట్‌ వైర్లను పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులకు ఈ రెండు సంఘటనలు అద్దం పడుతున్నాయి.

కారులో కూర్చున్నా హెల్మెట్‌ పెట్టుకోవాలా?

శ్యాంలాల్‌ బిల్డింగ్‌ ప్రాంతానికి చెందిన అమోఘ అర్ణవ మల్లంపల్లి హెల్మెట్‌ (Helmet) ధరించలేదని ట్రాఫిక్‌ పోలీసులు (Traffic Police) చలానా విధించారు. దీంతో ఆయన షాక్‌కు గురయ్యాడు. ఎందుకంటే.. ఆయన తిరిగేది కారులో. ఈ-చలానాలోని ఫొటో పరిశీలించగా ఆయన కారు పక్కన ఉన్న ద్విచక్ర వాహనదారుడు (Biker) హెల్మెట్‌ పెట్టుకోలేదన్న విషయం అర్థమైంది. అతడికి పంపాల్సిన చలానా తన కారు నంబరుతో తనకు పంపించారని మల్లంపల్లి ఆరోపిస్తున్నారు. వెహికిల్‌ మోడల్‌లో వోక్స్‌ వ్యాగన్‌ అని కనిపిస్తున్నా.. ఆ చలానా తనకు ఎందుకు పంపారో అర్థం కావడం లేదని అతడి ఆవేదన.

ఒకరు పార్క్‌ చేసుకోమన్నారు.. ఇంకొకరు ఫొటో తీశారు..

రవీంద్రభారతి వద్ద ఇటీవల ఓ కార్యక్రమం జరిగింది. కార్లు (Car parking) విపరీతంగా రావడంతో లోపల పార్కింగ్‌కు అవకాశం లేదు. దీంతో ఓ ట్రాఫిక్‌ అధికారి రవీంద్రభారతి నుంచి ఏజీ ఆఫీస్‌ వరకు సింగిల్‌ లేన్‌ పార్కింగ్‌ చేసుకునేందుకు అనుమతిచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న మరో ట్రాఫిక్‌ అధికారి సింగిల్‌ లేన్‌లో ఆగి ఉన్న కార్లన్నింటికీ ఫొటోలు తీసి రూ. వెయ్యి చొప్పున చలానాలు (Photo challan) పంపించారు. అంటే అధికారుల మధ్య సమన్వయం లేదన్న మాట.

నియంత్రణ గాలికొదిలేసి..

నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం 6:00 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకు వాహనదారులు రోడ్లపై ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు మరోవైపు ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు నరకం చూపిస్తున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సింది పోయి చలాన్లకే పరిమితం అవుతున్నారు. వాహనదారుల ఫొటోలు తీయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని జంక్షన్లలో మినహా.. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతంలోనే తనిఖీల పేరుతో పోలీసులు వాహనాలు ఆపుతుండటంతో సమస్య తీవ్రంగా మారుతోంది.

వసూళ్ల టార్గెటే దీనికి కారణమా?

వాహనదారుల నుంచి పెండింగ్‌ చలానాలు వసూలు చేయాలని ఉన్నతాధికారులు లక్ష్యం నిర్దేశించినట్లు తెలుస్తోంది. దాంతో ప్రత్యేక సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఎక్కడపడితే అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వాహనంపై అప్పటి వరకు ఉన్న చలానాలను కట్టాల్సిందే అంటూ వాహనదారులను ముందుకు కదలనీయడం లేదు. దీంతో చేతిలో డబ్బు లేనివారు, మెడికల్‌ ఎమర్జెన్సీపై వెళ్లే వారు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకు వాహనదారులు చలానాలను ఆన్‌లైన్‌లో చెల్లించేవారు. రెండేళ్లకోసారి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సమయంలో పూర్తిగా కట్టేద్దామని ఎదురుచూసేవారు. ఇప్పుడు అవేవీ పట్టించుకోని ట్రాఫిక్‌ పోలీసులు.. డబ్బు వసూలే లక్ష్యంగా వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక తనిఖీల పేరుతో ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయమై కొంతమంది ట్రాఫిక్‌ సిబ్బందిని ఆరా తీయగా, పెండింగ్‌ చలానాలను వసూలు చేయాలని ఉన్నతాధికారులు టార్గెట్‌ను నిర్దేశించినట్లు పేర్కొనడం గమనార్హం. దీంతో లక్ష్య సాధన కోసం కొందరు ట్రాఫిక్‌ పోలీసులు ఎన్నడూ లేని విధంగా వాహనదారులను వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నింపడానికే చలానాల వసూలు పేరుతో పేద, మధ్య తరగతి వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తీరుమారని డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు

డ్రంకెన్‌ డ్రైవ్‌ (Druken drive) తనిఖీల పేరుతో ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ జామ్‌కు కారణం అవుతున్నారు. రాత్రి 7 - 8 గంటలకే పలు ప్రధాన ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్‌ చేస్తున్నారు. దాంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ (Trafic police) అవుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధుల్లో నిమగ్నమై అలసిపోయిన ఉద్యోగులు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం సందర్భం లేకుండా ఇష్టానుసారంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్ధరాత్రి ఫ్రీ..

బార్లు, పబ్బులు, క్లబ్బుల్లో ఫుల్‌గా తాగేవారు, బడాబాబుల పిల్లలు, పోకిరీలు రాత్రి పది తర్వాతే బయటకు వస్తున్నారు. అర్ధరాత్రుళ్లు రోడ్లపై దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం రాత్రి 7- 9 మధ్యలో డ్రంకెన్‌ డ్రైవ్‌లు నిర్వహించి పేద, మధ్యతరగతి వాహనదారులను పట్టుకొని కేసులు బుక్‌ చేస్తున్నారు. అర్ధరాత్రుళ్లు హల్‌చల్‌ చేసే వారిని మాత్రం పట్టించుకోవడం లేదు. సాయంత్రం 7 గంటలకే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు ప్రారంభించి, రాత్రి 9లకు ముగించేస్తున్న తీరుపై ట్రాఫిక్‌ పోలీసులను సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-03-09T17:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising