ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Defying Death: మృత్యువును ఆపేందుకు ‘మనీ’మంత్రం.. వయసును తగ్గించుకునేందుకు లక్షల కోట్లు వెదజల్లుతున్న బిలియనీర్లు వీళ్లే..!

ABN, First Publish Date - 2023-02-07T16:55:58+05:30

వేల సంవత్సరాల ప్రయత్నాలు నేటికి ఫలించాయా? వయసు తగ్గించుకున్నానని ఓ ధనవంతుడు చేసిన ప్రకటన దానికి బలం చేకూరుస్తోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యశోద సినిమా చూసినవాళ్ళకు వన్నె తగ్గని అందం వెనుక చోటుచేసుకుంటున్న దారుణమైన నిజం తెలిసి కాస్త విస్మయం కలిగి ఉంటుంది. సినిమా ప్రపంచంలో మనకు ఈ విషయం ఒక సంచలనమే. అయితే వాస్తవంగా తమ వయసును తగ్గించుకోవాలని చూస్తున్న కోటీశ్వరులున్నారు. వేల సంవత్సరాల నుండి వయసుకు కళ్ళెం వెయ్యాలని, మృత్యువును జయించాలని ప్రయత్నాలు చేసి విఫలం అయినవాళ్ళు ఉన్నారు.

రెండువేల సంవత్సరాల క్రితం చైనాను పరిపాలించిన క్విన్ షి హువాంగ్ ఒక ప్రత్యేకపానీయం తాగేవాడు. దానివల్ల అతను ఎప్పటికీ యంగ్ గా ఉంటాడని భావించాడు. కానీ అతను 49సంవత్సరాల వయసుకే మరణించాడు. 1600 సంవత్సరాల క్రితం తూర్పు జిన్ రాజవంశానికి చెందిన సిమా చక్రవర్తి మరణాన్ని జయించాలని రసాయన ఫార్ములాతో చేసిన ఒక టాబ్లెట్ తీసుకున్నాడు. అయితే అతను ఆ టాబ్లెట్ తీసుకున్న 4సంవత్సరాలలోపు మరణించాడు. 17వ శతాబ్దంలో హంగేరీ క్వీన్ ఎలిజబెత్ బాథోరి భయంకరమైన మార్గం అనుసరించింది. కన్నెపిల్లల రక్తంతో స్నానం చేస్తే ఎప్పటికీ యవ్వనంగా ఉండవచ్చనే చెప్పుడుమాటలు నమ్మి ఏకంగా 600కంటే ఎక్కువమంది కన్నెపిల్లలను చంపి వారి రక్తంతో స్నానం చేసింది. కానీ ఆమె 50సంవత్సరాల వయసుకే మరణించింది.

చనిపోవాలని ఎవరికీ ఉండదు. తమ చేతిలో ఉన్న అధికారం, డబ్బుతో మరణాన్ని జయించాలని చూస్తున్న కోటీశ్వరులు ఇప్పటికీ ఉన్నారు. తాజాగా నేను వయసు తగ్గించుకున్నానంటూ ఓ ధనవంతుడు చేసిన అనౌన్స్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రమంలో పెరుగుతున్న వయసును ఆపేందుకు లక్షలకోట్లను వెధజల్లుతున్న కోటీశ్వరులెవరు? వారు తమ వయసు తగ్గించుకోవడానికి ఎంత ఖర్చు చేస్తున్నారు? మొదలయిన వివరాలు తెలుసుకుంటే..

అమెరికా పారిశ్రామికవేత్త బ్రయాన్ జాన్సన్ కేవలం 7నెలల కాలంలో 45సంవత్సరాల వయసునుండి యంగ్ గా మారినట్టు చేసిన ప్రకటన సంచలనమైంది. ఇతడు నిరంతర వైద్యుల సమక్షంలో నిర్ణీత ఆహారం, వైద్యుల మధ్య పదులకొద్ది ట్రీట్మెంట్లు తీసుకుంటూ వయసు తగ్గించుకున్నట్టు ఇతని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇతని గుండె 37సంవత్సరాల వయసు, ఊపిరితిత్తులు 18సంవత్సరాల వయసు, చర్మం 28 సంవత్సరాల వయసుకు మార్పు చెందాయట. గత కొన్ని సంవత్సరాల కాలంలోకి చూస్తే ప్రపంచం మొత్తం మీద ఉన్న కోటీశ్వరులు మృత్యువును జయించడానికి కోట్లను వెచ్చించారు, ఇప్పటికీ వెచ్చిస్తూనే ఉన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నుండి ఫేస్ బుక్ స్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ వరకు ఎంతో మంది ఎన్నో ఏళ్ళ నుండి లక్షల కోట్లు ధారపోస్తున్నారు. వయసును, మృత్యువును జయించడానికి ఎవరు ఎన్నికోట్లు వెచ్చిస్తున్నారంటే..

పీటర్ థీల్

paypal, palantri technologoes ఫౌండర్ గానూ, రిపబ్లికన్ రాజకీయ నాయకులకు విరాళాలు ఇవ్వడంలోనూ బాగా ఫేమస్ అయిన పీటర్ థీల్ మృత్యువును జయించడానికి, వయసు పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి పరిశోధనలు చేస్తున్న సంస్థలకు కోట్లాదిరూపాయలను వెచ్చిస్తున్నాడు. థీల్ యూనిటీ బయోటెక్నాలజీలో ఇతనే మొదటి పెట్టుబడి పెట్టాడు. వృద్దాప్య కణాలను లక్ష్యంగా చేసుకుని ఈ సంస్థ పరిశోధన చేస్తుంది. యాంటీ ఏజింగ్ ప్రయోగాలపై దృష్టి పెట్టిన మెతుసెలా ఫౌండేషన్ కు ప్రతి సంవత్సరం 3.5మిలియన్ డాలర్లు ఇచ్చేవాడు. ఆ తరువాత 2017 నుండి దీన్ని 7మిలియన్ డాలర్లకు పెంచాడు. ఇవి మాత్రమే కాకుండా జీవిత కాలాన్ని పొడిగించేందుకు ప్రయోగాలు చేస్తున్న అనక సంస్థలలో పెట్టుబడులు పెట్టాడు.

లారీ ఎల్లిసన్

ఒరాకిల్ కో ఫౌండర్ అయిన లారీ ఎల్లిసన్ మొదటినుండి మరణం గురించి ఆలోచించేవాడు. 1997లో ఎల్లిసన్ మెడికల్ ఫౌండేషన్ ను స్థాపించి అక్కడ జీవితకాలాన్ని పెంచేదిశగా జరిగే ప్రయోగాలను ప్రోత్సహించాడు. వయసుకు సంబంధించిన వ్యాధులు, కణజాలాలపై పరిశోధనలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. 2013లో ఈ ఫౌండేషన్ కు నిధులు సమకూర్చడం ఆపేవరకు సుమారు 430మిలియన్ డాలర్లు ఖర్చుచేసారు.

లారీ పేజ్

2013లో గూగుల్ కో ఫౌండర్ లారీ పేజ్ కాలిఫోర్నియా లైఫ్ కంపెనీని స్థాపించాడు. దీనిని కాలికో ల్యాబ్స్ అని పిలుస్తారు. వయస్సుకు సంబంధించిన వ్యాధులకు మందులను అభివృద్ది చేయడం, వృద్దాప్యం గురించి పరిశోధన చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. దీనికి అనుబంధంగా మరిన్ని సంస్థలు కూడా ప్రారంభించబడ్డాయి. అయితే 12వేల కోట్లు ఖర్చుపెట్టినా ఇందులో ఎలాంటి పురోగతి కనిపించలేదట.

సెర్గీ బ్రిన్

గూగుల్ కో ఫౌండర్ అయిన సెర్గీ బ్రిన్ కు జీవితకాలాన్ని పొడిగించుకోవాలని అనుకోవడంలో ఉన్న ఉద్దేశం వేరు. ఇతను పార్కిన్సన్ వ్యాధిపై పరిశోధనల కోసం మిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఖర్చుచేసాడు. వయస్సును ఆపడానికి ప్రయత్నిస్తున్న అనేక సంస్థలకు లీడర్ గా ఉన్నాడు.

మార్క్ జుకర్బర్గ్

ఫేస్ బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ తన మార్క్ ను జీవితకాలం పొడిగించుకోవడంలో కూడా వదల్లేదు. ఇతను తన భార్యతో కలసి 'బ్రేక్ ట్రూ ప్రైజ్' ను ప్రవేశపెట్టి చాలా కష్టతరమైన ప్రశ్నలకు లోతైన సమాధానాలు ఇచ్చే శాస్త్రవేత్తలకు ఏటా 3మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తున్నారు. ఈ శాతాబ్దం చివరినాటికి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని వీరు తెలిపారు. ఇందులో వయసుకు, వృద్దాప్యానికి, జీవితకాలం పొడిగింపుకు సంబంధించిన ప్రశ్నలు చాలా ఉన్నాయి.

సీన్ పార్కర్

ఫైల్ షేరింగ్ సర్వీస్ napster కు కో ఫౌండర్ అయిన సీన్ పార్కర్ మొదటి ఫేస్ బుక్ ప్రెసిడెంట్ గా అందరికీ తెలిసినవాడే.. ఇతనికి ఫుడ్ అలర్జీ ప్రాబ్లెమ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంతో ఇతను 2015లో 600మిలియన్ల డాలర్లు వెచ్చించి పార్కర్ ఫౌండేషన్ ను స్థాపించాడు. పలురకాల వ్యాధులు, ఆరోగ్యసమస్యల గురించి పరిశోధనలు చేయడానికి నిధులు సమకూర్చుకోవడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. పార్కర్ క్యాన్సర్ ఇమ్యునోథెరపిని కూడా స్థాపించాడు. దీర్ఘాయువు దిశగా కూడా వీరి పరిశోధనలు సాగుతున్నాయి.

జెఫ్ బెజోస్

అమెజాన్ ఫౌండర్ గా జెఫ్ బెజోస్ పేరు అందరికీ పరిచితమే.. జీవితకాలాన్ని పెంచడానికి ప్రయోగాలు చేస్తున్న అల్టోస్ ల్యాబ్ లో ఇతనూ ఒక పెట్టుబడిదారుగా ఉన్నాడు. వ్యాధులు, గాయాలు, జీవితకాల వైఫల్యాలను తిప్పికొట్టేందుకు ప్రయోగాలు సాగుతున్నాయి. ఈ ల్యాబ్ లో పెద్ద మొత్తం శాస్త్రవేత్తల నియమాకం జరుగుతోంది. ఏడాదికి 3మిలియన్ డాలర్లకు పైగా ఈ ల్యాబ్ కు నిధులు సమకూరుతున్నాయి.

బ్రయాన్ జాన్సన్

బ్రయాన్ జాన్సన్ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ ప్రారంబించాడు. ఈ ప్రాజెక్ట్ కు ఏటా 16కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్టు సమాచారం. ఇతను ఆహారం నుండి జీవనశైలి వరకు ఎన్నో మార్పుచేర్పులు చేసుకుంటూ వైద్యుల సమక్షంలో రోజూ పదులకొద్ది ట్రీట్మెంట్ లలో గడుపుతున్నాడు. ఫలితంగా వయసు విషయంలో మెరుగైన ఫలితాలు సాధించి యంగ్ గా మారుతున్నాడు. 45ఏళ్ళ వాడు కాస్తా కుర్రాడిలా మార్పు చెందాడు. కొసమెరుపు ఏమిటంటే ఇతను తీసుకుంటున్న వైద్యంలో ఆహారం పూర్తిగా శాకాహారం మాత్రమే, అది కూడా రోజుకు 1977 కేలరీలు మాత్రమే తీసుకుంటున్నాడు. ఇలా యంగ్ గా మారడం ప్రపంచ రికార్డ్ అంటున్నారంతా.

అన్నే వోజ్కికీ

జీవితకాలం పెంచుకోవడానికి పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో అన్నే వోజ్కికీ కూడా ఒకరు. వయసును ఛాలెంజ్ చెయ్యడానికి వివిధ సంస్థలలో పెట్టుబడి పెడుతున్నట్టే ఈమె కూడా పెట్టుబడులు పెడుతున్నారు. జన్యు పరీక్ష సంస్థ 23andMe అనే సంస్థను ఈమె స్థాపించారు. ఈమె గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ మాజీ భార్య. అండాశయంలో కణాలను రీప్రోగ్రాం చేసే లక్ష్యంతో కూడా ఈమె పెట్టుబడులు పెడుతున్నారు.

డేవిడ్ ముర్డాక్

డేవిడ్ ముర్డాక్ డోల్ ఫుడ్ ప్రోడక్ట్ మాజీ చైర్మన్. ఈయన ప్రస్తుత వయసు 99ఏళ్ళు. కేవలం మొక్కలకు సంబంధించిన ఆహారం మాత్రమే తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు ఈయన. 125ఏళ్ళు జీవించాలనేది ఈయన కోరిక. అందుకోసం 'కరోలినా రీసెర్చ్ క్యాంపస్' పేరుతో ఒక ప్రైవేట్ రీసెర్చ్ సెంటర్ ను 500మిలియన్ల కోట్లు వెచ్చించి స్థాపించాడు. సరైన విధంగా మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకుంటే జీవితకాలం పెరుగుదలకు అవి సహకరిస్తాయని ఈయన పేర్కొన్నాడు.

సినిమాల్లో చెప్పుకున్నట్టు దారుణాలు ఉంటాయో లేదో కానీ వయసు మీద, మృత్యువు మీద యుద్దం చేస్తున్న ఈ ధనవంతులు టెక్నాలజీని, ప్రపంచ ఆర్థికవ్యవస్థను మాత్రమే కాదు తమ జీవితకాలాన్ని తామే శాసించుకుంటున్నారు.

Updated Date - 2023-02-07T18:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising