ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ దగ్గర రూ.10 కాయిన్స్ ఉన్నాయా..? అయితే ఈ వార్తను మీరు తప్పకుండా చదివి తీరాల్సిందే..!

ABN, First Publish Date - 2023-02-04T20:17:37+05:30

తినుబండారాల దగ్గర నుంచి వివిధ రకాల వస్తువుల వరకూ అన్నీ నకిలీమయమయ్యాయి. చూడటానికి అచ్చం ఒరిజినల్‌లా ఉన్నా.. చివరకు నకిలీవని తెలసుకుని అవాక్కవడం మన వంతవుతుంటుంది. ఇక నకిలీ నోట్ల గురించి ప్రత్యేకంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తినుబండారాల దగ్గర నుంచి వివిధ రకాల వస్తువుల వరకూ అన్నీ నకిలీమయమయ్యాయి. చూడటానికి అచ్చం ఒరిజినల్‌లా ఉన్నా.. చివరకు నకిలీవని తెలుసుకుని అవాక్కవడం మన వంతవుతుంటుంది. ఇక నకిలీ నోట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తరచూ ఎక్కడో చోట పెద్ద ఎత్తున నకిలీ నోట్లను తయారు చేయడం, పట్టుబడడం చూస్తూనే ఉన్నాం. అయితే అక్రమార్కులు రోజు రోజుకూ తెలివిమీరిపోతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏకంగా రూ.10లు కాయిన్స్‌ను కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

హర్యానాలో (Haryana) నకిలీ రూ.10ల నాణేలు తయారవుతున్నాయని ఢిల్లీ పోలీసులు (Delhi Police) గుర్తించారు. 2022 ఏప్రిల్‌లో హర్యానాలోని చార్కి దాద్రీలో నకిలీ నాణేలు (Fake coins) తయారు చేస్తున్న యంత్రాల యూనిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి నరేష్ కుమార్‍‌తో పాటూ ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని జిగ్నేష్ గాలా అనే వ్యక్తిని ఇటీవలే అరెస్ట్ చేశారు. అయితే ఈ 10 నెలల విచారణలో హర్యానాలోని చర్కీ దాద్రీ ఫ్యాక్టరీలో కాకుండా మరికొన్ని ప్రాంతాల్లోని ప్రధాన ఫ్యాక్టరీల్లో యంత్రాలను తయారు చేస్తున్నట్లు విచారణలో వెళ్లడైంది. సదరు ఫ్యాక్టరీ నుంచి వివిధ ప్రాంతాలకు యంత్రాలను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.

ఆరేళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. సడన్‌గా భార్య ఫోన్ స్విచాఫ్.. ఇంట్లో కూడా లేకపోవడంతో ఆ భర్త ఆరా తీస్తే షాకింగ్ ట్విస్ట్..

ఇటీవల అరెస్టయిన గాలా.. ముంబైలోని (Mumbai) మలాడ్ వెస్ట్ నివాసి అని పోలీసులు తెలిపారు. సదరు నిందితుడు యంత్రాలను దిగుమతి చేసుకుని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నకిలీ నాణేల తయారీ ముఠాలకు సరఫరా చేస్తున్నారని చెప్పారు. జిగ్నేష్ గాలా నుంచి రూ.9.46లక్షల విలువైన నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.94,600 విలువైన రూ.10లు నాణేలు ఉన్నాయి. గాలా అరెస్ట్‪‌తో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఢిల్లీ, ముంబై పోలీసులు త్వరలో హర్యానాకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నకిలీ నాణేల తయారీ వ్యవహారం హర్యానాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: వృద్ధురాలికి ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న కొండముచ్చు.. ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-02-04T20:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising