ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking News: పచ్చి చేపలోని ఆ భాగాన్ని తింటే డయాబెటిస్ తగ్గుతుందట.. అలా తిన్న ఓ మహిళ ఇప్పుడెలాంటి పరిస్థితుల్లో ఉందంటే..

ABN, First Publish Date - 2023-05-05T16:33:09+05:30

కాలుష్యం, కల్తీ ఆహారం తదితర కారణాలతో ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతున్నారు. సమస్య పరిష్కారానికి కొందరు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటే.. మరికొందరు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలుష్యం, కల్తీ ఆహారం తదితర కారణాలతో ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతున్నారు. సమస్య పరిష్కారానికి కొందరు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటే.. మరికొందరు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే మహిళ విషయంలో కూడా ఇలాగే జరిగింది. మధుమేహ సమస్యతో బాధపడుతున్న సదరు మహిళ.. సన్నిహితుల సలహాతో చేపలోని ఓ భాగాన్ని తినేసింది. దీంతో చివరకు ఏం జరిగిందంటే..

జార్ఖండ్‌ రాంచికి చెందిన 48 ఏళ్ల సీతాదేవి అనే మహిళ (woman) కొన్ని నెలలుగా మధుమేహ (diabetes) సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో చాలా ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంది. అయినా సమస్య మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో తెలిసిన వారి సలహా మేరకు స్థానికంగా ఉన్న ఓ వైద్యుడిని సంప్రదించింది. అతడు మందులు ఇవ్వడంతో పాటూ రోహు అనే రకం చేపకు చెందిన పిత్తాశయాన్ని పచ్చిగా తీసుకోవాలని సూచించాడు. డయాబెటిస్ తగ్గుతుందనే ఉద్దేశంతో అతను చెప్పినట్లుగా పచ్చిగా ఉన్న చేప పిత్తాశయాన్ని (woman ate fish gall bladder) తీసుకుంది. రోజుల వ్యవధిలో ఆమె తీవ్ర వికారం, వాంతులతో తీవ్ర ఇబ్బంది పడింది.

Viral Video: నువ్వు కదయ్యా.. అసలు సిసలు తండ్రివంటే.. కూతురి సంతోషం కోసం అమ్మాయిలాగా వేషం వేసుకుని మరీ..!

చివరకు బుధవారం ఢిల్లీలోని (Delhi) ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించింది. పరీక్షించిన వైద్యులు ఆమె కిడ్నీలు దెబ్బతిన్నట్లు (Kidney damage) గుర్తించారు. ఆహారపు అలవాట్ల గురించి వైద్యులు అడగడంతో విషయం బయటపడింది. దీనిపై వైద్యులు మాట్లాడుతూ కొన్ని రకాల చేపలు వాటి జీర్ణ వ్యవస్థలో అధిక స్థాయిలో విడుదల చేస్తాయని, ఇందులో సైప్రినాల్ అనే టాక్సిన్ ఉండడం వల్ల.. అధిక పరిమాణంలో తీసుకోవడం ప్రమాదకరమని చెప్పారు. పిత్తం ఎక్కువ విడుదల చేసే చేపలను అధికంగా తినకపోవడమే మంచిదని, ఒక వేళ తినాల్సి వస్తే.. బాగా ఉడికించి తీసుకోవాలని సూచించారు. కిడ్నీలు దెబ్బతిన్న మహిళ కోలుకుంటోందని, మరో వారంలో డిశ్చార్జి చేయనున్నట్లు ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది.

20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..

Updated Date - 2023-05-05T16:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising