ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

K Viswanath: విశ్వనాథుని ఈ సినిమాలు... వెండితెరపై సిరివెన్నెలలు!.. అవి మీకు తెలుసా..

ABN, First Publish Date - 2023-02-03T13:58:59+05:30

అచ్చమైన తెలుగుదనానికి అందమైన చిరునామా కాశీనాథుని విశ్వనాథ్‌ (K Viswanath) సినిమా. అనేక కథాంశాలతో సినిమాలను తెరకెక్కించిన కళాతపస్వి ఆయన. కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచ్చమైన తెలుగుదనానికి అందమైన చిరునామా కాశీనాథుని విశ్వనాథ్‌ (K Viswanath) సినిమా. అనేక కథాంశాలతో సినిమాలను తెరకెక్కించిన కళాతపస్వి ఆయన. హీరోని గుడ్డివానిగా, హీరోయిన్‌ మూగ అమ్మాయిగా సినిమా (సిరివెన్నెల) తీసి ఒప్పించి విజయం సాధించడం ఆయనకే చెల్లింది. వరకట్న సమస్యపై ‘శుభలేఖ’, కుల వ్యవస్థపై ‘సప్తపది’, గంగిరెద్దువాళ్ల జీవితాలపై ‘సూత్రధారులు’ చిత్రాలను మలిచారు. ఇంకా సిరి సిరి మువ్వ, శ్రుతిలయలు, స్వాతికిరణం, స్వర్ణకమలం, శుభలేఖ, శుభోదయం, శుభ సంకల్పం వంటి కళాత్మక సినిమాలు ఆయన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఆణిముత్యాల్లాంటి ఆయన సినిమాల్లో కొన్నింటి విశేషాలు...

ఓ సీత కథ (1974): ఈ చిత్ర కథాంశం అప్పట్లో ఓ సంచలనం. తాను ప్రేమించిన ఓ అమ్మాయి తనకు దక్కలేదనే కోపంతో ఆమె ప్రేమిస్తున్న వాడిని చంపిస్తాడు విలన్‌. తాను ప్రేమించినవాడి హఠాన్మరణానికి కారకుడైనవాడికి బుద్ధి వచ్చేలా చేయాలని ఆ అమ్మాయి విలన్‌ తండ్రిని పెళ్లి చేసుకుంటుంది. వినడానికే చాలా కఠినంగా ఉన్న ఈ చిత్రాన్ని విశ్వనాథ్‌ అత్యద్భుతంగా తెరకెక్కించారు. తాను కోరుకున్న అమ్మాయి.. తనకు తల్లిగా ఇంటికి వచ్చినప్పుడు ఆ విలన్‌ పడే వ్యధను తెరకెక్కించిన విధానం ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.

సిరిసిరిమువ్వ (1976): సంగీత నృత్య ప్రధాన సినిమా. నాట్యమంటే ఎనలేని మక్కువ ఉన్న హైమ (జయప్రద) అనే ఓ పల్లెటూరి మూగపిల్ల కథ. ఆమెను సవతి తల్లి కష్టాల నుంచి కాపాడి పట్టణం తీసుకెళ్లి మంచి నర్తకిగా పేరు తెచ్చుకునేందుకు సాయపడే సాంబయ్య పాత్రలో చంద్రమోహన్‌ నటించారు. వీరిద్దరి నటన ఇప్పటికీ, ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి, కనిపిస్తాయి. ఈ చిత్రానికి వేటూరి సుందరామ్మూర్తి రాసిన పాటలు ప్రత్యేక ఆకర్షణ. ‘ఝుమ్మంది నాదం... సయ్యంది పాదం’ పాట సూపర్‌ హిట్‌. ఈ సినిమాను హిందీలో ‘సర్‌గమ్‌’గా పునర్నిర్మించారు. హిందీలో కూడా కథానాయికగా జయప్రద నటించారు. ఆమె బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి ఈ సినిమా మార్గం సుగమం చేసింది.

శుభలేఖ (1982): అప్పటికి నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న చాలామంది యువతకు ఓ మార్గం చూపించిన సినిమా ఇది. టాలెంట్‌ ఉండాలే కానీ ఎలాంటి ఉద్యోగమైనా చేయొచ్చు అని చిరంజీవి పాత్ర ద్వారా తెలియజేశాడు విశ్వనాథ్‌. అలాగే స్వచ్ఛమైన ప్రేమ ముందు కులం, జాతి, ఐశ్వర్యం అనేవి అడ్డంకి కాదని మరోసారి తెలియజేశారు. ఈ చిత్రంలో చిరంజీవి నటనకు ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డ్‌ రావడం విశేషం. ఈ సినిమాతో నటుడు సుధాకర్‌ ఇంటిపేరు ‘శుభలేఖ’గా మారింది.

సిరివెన్నెల (1986): గేయ రచయిత సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గా మార్చిన చిత్రమిది. హీరో అంధుడు, అతడ్ని ఇష్టపడే అమ్మాయి మూగ. వీరిద్దరి ప్రేమకు మధ్యలో ఓ గైడ్‌. ఒక అద్భుతమైన ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఇది. సినిమా ఎండింగ్‌ చూసి కన్నీరు పెట్టని ప్రేక్షకుడు ఉండడు.

శ్రుతిలయలు (1987): మన మూలాలను ఎప్పటికీ మరువకూడదు అనే బేసిక్‌ లైన్‌తో తెరకెక్కిన అద్భుతమైన చిత్రమిది. అప్పటివరకూ యాంగ్రీ యంగ్‌ మేన్‌ గా జనాలని అలరిస్తున్న రాజశేఖర్‌ సాఫ్ట్‌ రోల్స్‌ కూడా ప్లే చేయగలడు అని ప్రూవ్‌ చేసిన సినిమా ఇది. సుమలత పాత్రను అంత సహజంగా ఎలా రాయగలిగారో తెలియదు కానీ.. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కు సరైన ఉదాహరణ ఆమె పాత్ర.

స్వయంకృషి (1987): అప్పటికే కిరాతకుడు, కొండవీటిరాజా, వేట, చంటబ్బాయి, పసివాడి ప్రాణం లాంటి సినిమాల్లో నటించి సూపర్‌ మాస్‌ ఇమేజ్‌ సొంతం చేసుకోవడమే కాక మెగాస్టార్‌గా చిరంజీవి ఎదుగుతున్న తరుణమది. ఆ సమయంలో చెప్పులు కుట్టే వ్యక్తిగా నటించడం అంటే సాహసమే. చిరంజీవి రిస్క్‌ చేసి మరీ నటించిన చిత్రమిది. ఒక చెప్పులు కుట్టే వ్యక్తి స్వయంకృషితో అందలాన్ని అధిరోహించడమే కథాంశం. అలాగే పిల్లలకి బాధ్యత తెలియకుండా పెంచడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయనేది కూడా ఈ చిత్రంలో చూపించారు విశ్వనాథ్‌.

Updated Date - 2023-02-03T14:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising