ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలా? అయితే ఈ సూచనలు పాటించండి..!!

ABN, First Publish Date - 2023-07-29T13:44:18+05:30

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే అనారోగ్యం తప్పదు. అవయవాలు సక్రమంగా పని చేస్తే ఆరోగ్యానికి ఎలాంటి తిరుగుండదు. ఒకరకంగా చెప్పాలంటే శరీరం కూడా ఒక యంత్రం లాంటిదే. సరైన ఆహారం, సాధనలతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉంటే శరీరం ఒక అద్భుతంలా తయారవుతుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలను తప్పక పాటించాలి.

మానవ శరీరం ప్రకృతి ఇచ్చిన వరం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే అనారోగ్యం తప్పదు. శరీరం అంటే కేవలం చర్మం మాత్రమే కాదు అవయవాలన్నీ. అవయవాలు సక్రమంగా పని చేస్తే ఆరోగ్యానికి ఎలాంటి తిరుగుండదు. ఒకరకంగా చెప్పాలంటే శరీరం కూడా ఒక యంత్రం లాంటిదే. సరైన ఆహారం, సాధనలతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉంటే శరీరం ఒక అద్భుతంలా తయారవుతుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూచనలను తప్పక పాటించాలి. అలాంటి సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రతి ఒక్కరూ పాటించాల్సిన సూచనలు:

1) మీకు దాహం లేదా అవసరం లేకపోయినా అన్ని సమయాలలో నీరు తాగాలి. శరీరానికి తగినంత నీరు అందకపోతే అనారోగ్య సమస్యలు దాపురిస్తాయి. అందుకే రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి.

2) శరీరాన్ని ఉపయోగించి సాధ్యమైనంత ఎక్కువ పని చేయండి. నడక, ఈత లేదా ఏదైనా ఆటల ద్వారా శరీర కదలికలు ఉండాలి.

3) తక్కువ తినండి. ఎక్కువగా తినాలనే కోరికను విడనాడండి. ఎందుకంటే ఎక్కువ తినడం శరీరానికి మంచిది కాదు. ఎక్కువ ఆహారం తింటే శరీరం అలసిపోతుంది. అందువల్ల ఆహార పరిమాణం తగ్గించాలి. మనం తినే ఆహారంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు మోతాదుకు మించి ఉండరాదు.

4) ఖచ్చితంగా అవసరమైతే తప్ప వాహనాన్ని ఉపయోగించవద్దు. మీరు కిరాణా సామాను తీసుకోవడానికి, ఎవరినైనా కలవడానికి లేదా ఏదైనా పని చేయడానికి ఎక్కడికైనా వెళ్తుంటే వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి.

5) కోపాన్ని విడిచిపెట్టండి. చింతించడం మానేయండి. బాధపెట్టే లేదా ఒత్తిడికి గురిచేసే విషయాలను మరిచిపోయేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే కోపం, బాధ, ఒత్తిడి లాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందువల్ల మీకు నచ్చిన వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడండి.

6) డబ్బు మీద ఎక్కువగా వ్యామోహం చెందకండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి. వారితో కలిసి మాట్లాడండి. నవ్వండి. మనుగడ కోసం డబ్బు కావాలి కానీ డబ్బే మనుగడ కాదనే విషయం గ్రహించండి.

7) మీ వల్ల కాని పని గురించి లేదా మీరు సాధించలేని విషయం గురించి చింతించకండి.వాటిని విస్మరించేందుకు ప్రయత్నించండి.

8) డబ్బు, పదవి, పలుకుబడి, అధికారం, అందం, కులం ఇలాంటి విషయాలపై దృష్టి సారించకండి. ఇవన్నీ అహాన్ని పెంచుతాయి. వినయం మనుషులను ప్రేమతో దగ్గర చేస్తుంది.

9) ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించండి. ఇలా ఆలోచించడం వల్ల ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. ఏ పని చేసినా పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగిపోండి.

10) పక్కవాళ్లను వ్యంగ్యంగా మాట్లాడుతూ కించపరచకండి. వాళ్లను సంతోషంగా ఉంచుతూ మీరు కూడా ఆనందంగా ఉండండి. చిన్నారులను, పెద్దలను సమానంగా చూడండి. ఆప్యాయత, గౌరవంతో మెలగండి. గతంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా.. వర్తమానంలో దాన్ని మరచిపోయి అందరితో కలిసిపోండి.


మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే..?

1. BP: 120/80

2. పల్స్: 70 - 100

3. ఉష్ణోగ్రత: 36.8 - 37

4. శ్వాస: 12-16

5. హిమోగ్లోబిన్: పురుషులకు -13.50-18

మహిళలకు - 11.50 - 16

6. కొలెస్ట్రాల్: 130 - 200

7. పొటాషియం: 3.50 - 5

8. సోడియం: 135 - 145

9. ట్రైగ్లిజరైడ్స్: 220

10. శరీరంలో రక్తం మొత్తం: PCV 30-40%

11. చక్కెర స్థాయి: పిల్లలకు (70-130) పెద్దలకు (70 - 115)

12. ఐరన్: 8-15 మి.గ్రా

13. తెల్ల రక్త కణాలు WBC: 4000 - 11000

14. ప్లేట్‌లెట్స్: 1,50,000 - 4,00,000

15. ఎర్ర రక్త కణాలు RBC: 4.50 - 6 మిలియన్లు.

16. కాల్షియం: 8.6 -10.3 mg/dL

17. విటమిన్ D3: 20 - 50 ng/ml.

18. విటమిన్ B12: 200 - 900 pg/ml.

Updated Date - 2023-07-29T13:44:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising