ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chewing Gum: ఒకేసారి 40 బబుల్ గమ్‌లను తిన్న 5 ఏళ్ల కొడుకు.. తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆ బాలుడి పరిస్థితి ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-05-31T16:49:45+05:30

చిన్న పిల్లల విషయంలో కొన్నిసార్లు తల్లిదండ్రుల ఆజాగ్రత.. చివరికి చిన్నారుల ప్రాణాలకే అపాయం కలిగించవచ్చు. ఆడుకునే క్రమంలో వివిధ రకాల వస్తువులను నోట్లో పెట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులను చాలా మందిని చూశాం. కుటుంబ సభ్యుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న పిల్లల విషయంలో కొన్నిసార్లు తల్లిదండ్రుల ఆజాగ్రత.. చివరికి చిన్నారుల ప్రాణాలకే అపాయం కలిగించవచ్చు. ఆడుకునే క్రమంలో వివిధ రకాల వస్తువులను నోట్లో పెట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులను చాలా మందిని చూశాం. కుటుంబ సభ్యుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా, ఓ బాలుడికి విచిత్ర సమస్య వచ్చి పడింది. ఇందుకు సంబంధించిన వార్త.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐదేళ్ల బాలుడు ఒకేసారి 40 బబుల్ గమ్‌లను తిన్నాడు. తల్లి గమనించి చివరికి ఆస్పత్రికి తరలించింది. చివరికి ఏమైందంటే.

సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ (Viral news) అవుతోంది. ఆస్ట్రేలియాలోని (Australia) ఓహియోలో ఉంటున్న ఐదేళ్ల బాలుడు (five year old boy) ఇటీవల ఓ రోజు ఒకేసారి 40 బబుల్ గమ్‌లను తిన్నాడు. బబుల్ గమ్‌లు (bubble gum) మొత్తం వుండలా చుట్టుకోవడంతో కడుపునొప్పి మొదలైంది. దీంతో పాటూ డయేరియా (Diarrhea) సమస్య కూడా మొదలైంది. గమనించిన తల్లి పరుగెత్తుకుంటూ వచ్చి.. ‘‘ఏమైంది.. ఇంతకీ ఏ తిన్నావ్’’.. అని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. భయపడిపోయిన ఆమె.. కొడుకును చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది.

Viral News: కనిపించని కూతురు కోసం తండ్రి వెతుకులాట.. చివరకు పెంపుడు కుక్క వెనుకే వెళ్లగా.. నిర్మానుష్య ప్రదేశంలో షాకింగ్ సీన్..

ఎండోస్కోపీ చేసిన వైద్యులు.. కడుపులో బబుల్ గమ్‌లు అన్నీ ముద్దలా పేరుకుపోయాయని గుర్తించి, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. కొన్ని గంటల పాటు శ్రమించి, ఎట్టకేలకు బబుల్ గమ్‌ల ఉండను బయటికి తీశారు. చూయింగ్ గమ్‌లు పేగుకు అడ్డుపడి ఉండుంటే పరిస్థితి సీరియస్‌గా ఉండేదని వైద్యులు తెలిపారు. కాగా, బాలుడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఐర్లాండ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలి కడుపులో నుంచి సుమారు 55బ్యాటరీలను గుర్తించారు. చివరకు ఆపరేషన్ చేసి వాటిని విజయవంతంగా బయటికి తీశారు.

Live Frog In Packed Food: పార్శిల్‌లో సగం ఆహారాన్ని తిన్న తర్వాత.. ప్లాస్టిక్ కప్పులో ఎగురుతూ కనిపించిన కప్ప..!

Updated Date - 2023-05-31T16:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising